హెల్త్‌ కేర్‌ రంగంలో ఇంటర్నేషనల్‌ అవార్డ్‌

- December 12, 2017 , by Maagulf
హెల్త్‌ కేర్‌ రంగంలో ఇంటర్నేషనల్‌ అవార్డ్‌

వియెన్నా: మస్కట్‌ మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌, హెల్త్‌ కేర్‌ రంగంలో డైమండ్‌ ప్రైజ్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ క్వాలిటీ 2017 పురస్కారాన్ని అందుకుంది. యూరోపియన్‌ సొసైటీ ఫర్‌ క్వాలిటీ రీసెర్చ్‌ ద్వారా ఈ అవార్డ్‌ ప్రకటితమయ్యింది. ప్రపంచంలోని వివిధ సర్వీస్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌కి ఈ గుర్తింపు లభిస్తుంది. సుల్తానేట్‌లో హెల్త్‌ సర్వీసెస్‌ని మెరుగైన రీతిలో అందిస్తుండడంతో ఈ గుర్తింపు దక్కిందని అధికారిక వర్గాలు తెలిపాయి. మినిస్ట్రీ ఆఫ్‌ హెల్త్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌ డాక్టర్‌ అహ్మద్‌ బిన్‌ సలీమ్‌ అల్‌ మందారి ఈ పురస్కారాన్ని అందుకున్నారు. 43 దేశాలకు చెందిన 54 ఇన్‌స్టిట్యూషన్స్‌కి ఈ పురస్కారాలు దక్కాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com