న్యూజెర్సీ అటార్నీ జనరల్‌గా జాతీయుడు.!
- December 13, 2017అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్ర అటార్నీ జనరల్‌గా సిక్కు జాతీయుడు గుర్బీర్ ఎస్ గ్రేవాల్ కొత్త అటార్నీ జనరల్‌గా నియమితులయ్యారు. గతంలో న్యూయార్క్, న్యూజెర్సీలలో అసిస్టెంట్ అమెరికా అటార్నీగా పనిచేసిన గ్రేవాల్‌ను న్యూజెర్సీ గవర్నర్‌గా ఎన్నికైన ఫిల్ మర్ఫీ మంగళవారం అటార్నీ జనరల్‌గా నియమించారు. ఈ నియామకంతో అమెరికాలో మొట్టమొదటిసారిగా ఒక రాష్ట్రానికి అటార్నీ జనరల్‌గా నియమితుడైన సిక్కు అమెరికన్‌గా గ్రేవాల్ చరిత్ర సృష్టించారు. కాగా తనతో పాటు ఎన్నో వలస కుటుంబాలకు ఎంతో ఇచ్చిన ఈ దేశం రుణం తీర్చుకోవడానికి తాను ప్రజాసేవ చేయాలని నిర్ణయించుకున్నట్లు గ్రేవాల్ తెలిపారు. మిగతా అందరిలాగానే తాను కూడా గతంలో విద్వేషాన్ని, అసహనాన్ని స్వయంగా ఎదురుకున్నానని, అయినప్పటికీ నిష్పాక్షికమైన సమ సమాజంలో తామంతా జీవించేలా చూడటం కోసం కృషి చేయాలని అనుకుంటున్నానని ఈ ప్రకటన అనంతరం గ్రేవాల్ పేర్కొన్నారు. కాగా గ్రేవాల్‌ను అటార్నీ జనరల్‌గా నియమించడం పట్ల దక్షిణ ఆసియా బార్ ఆసోయేషన్ హర్షం వ్యక్తం చేసింది. 1999లో కాలేజ్ ఆఫ్ విలియం అండ్ మేరీ, మార్షల్ వైత్ స్కూల్ ఆఫ్ లా నుంచి గ్రేవాల్ లా డిగ్రీ పొందారు. తన లీగల్ కెరియర్లో అత్యధిక భాగం ప్రజాసేవలోనే గడిపిన గ్రేవాల్ బెర్జన్ కౌంటీ ప్రాసిక్యూటర్‌గా ఉన్నారు.
తాజా వార్తలు
- ముంబై: కుప్పకూలిన భారీ హోర్డింగ్.. 8 మంది మృతి, 60మందికి గాయాలు
- వాట్సాప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్..
- భారత్‌లో ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ‘గూగుల్ వ్యాలెట్’
- రూ.13.56 కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- గురుద్వారా సందర్శన..పాయసం వడ్డించిన ప్రధాని మోడీ
- Dh4,000కే GCC టూర్..యూనిఫైడ్ టూరిస్ట్ వీసా!
- హెయిర్ స్ట్రెయిట్నింగ్ తో కిడ్నీ సమస్యలు..?
- బహ్రెయిన్ లో రెండు రోజులపాటు స్కూళ్లకు సెలవులు
- జోర్డాన్ 'ఈగర్ లయన్ 2024'లో సౌదీ సాయుధ దళాలు
- భారత్-ఒమన్ మధ్య పెరిగిన విమాన ఛార్జీలు..!