కల్వరి సబ్ మెరైన్ ను జాతికి అంకితం చేసిన మోడీ
- December 13, 2017ముంబై : దాదాపు 17 ఏళ్ల నౌకాదళ కల నెరవేరింది. మేడిన్ ఇండియా స్కార్పియన్ జలాంతర్గామి ఐఎన్ఎస్ కల్వరి నేవీలో గురువారం భాగమైంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐఎన్ఎస్ కల్వరిని నౌకాదళానికి అప్పగిస్తూ జాతికి అంకితం చేశారు. ఫ్రాన్స్ నౌకా నిర్మాణ సంస్థ సహకారంతో ఐఎన్ఎస్ కల్వరి నిర్మాణం జరిగింది. హిందూ మహా సముద్రంలో ఇష్టానుసారం తిరుగుతున్న చైనా యుద్ధనౌకలకు దీనితో చెక్ పెట్టొచ్చు.
ఐఎన్ఎస్ కల్వరీని స్కార్పియన్ తరగతికి చెందిన జలాంతర్గామిని జాతికి అంకితం చేయడం అనేది మేకిన్ ఇండియా పథకానికి అతి పెద్ద బలాన్ని ఇస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ డీజిల్-ఎలక్ట్రికల్ సబ్‌మెరైన్‌ను ముంబైలోని మాజగాన్ డాక్‌యార్డ్‌లో నిర్మించారు. ఆరు సబ్ మెరైన్ల నిర్మాణంలో భాగంగా మొదటి జలాంతర్గామిని ప్రభుత్వం నేవీకి అప్పగించింది. కల్వరీ సబ్ మెరైన్ పరీక్ష దశలో 120 రోజుల పాటు సముద్రంలో ప్రయాణించింది. ఫ్రాన్స్ నావల్ డిఫెన్స్ అండ్ ఎనర్జీ కంపెనీ డిజైన్ ఆధారంగా కల్వరీ నిర్మాణం జరిగింది.
ఐఎన్ఎస్ కల్వరీని జాతికి అంకితం చేస్తూ.. భారత్-ఫ్రాన్స్ మధ్య వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఇదొక నిదర్శనం అని ప్రధాని మోదీ చెప్పారు. 1.566 టన్నుల బరువైన ఈ సబ్ మెరైన్ టైగర్ షార్క్ తరహాలో హిందూ మహాసముద్రంలో డీప్ సీ ప్రెడేటర్‌గా అత్యంత సమర్థవంతంగా పనిచేయనుందన్నారు. సముద్ర మార్గం ద్వారా ప్రవేశించే ఉగ్రవాదం, డ్రగ్స్ రవాణా, అక్రమ చేపల వేటను మరింత సమర్ధవంతంగా ఎదుర్కోవడంలో భారత్ మరింత కీలక భూమిక పోషించనుందని తెలిపారు.
ఇదిలా ఉండగా.. భారత్ 1980, 1990లలో రష్యా, జర్మనీల నుంచి జలాంతర్గాములను నౌకాదళం సమకూర్చుకుంది. జర్మన్ సబ్మెరైన్ల కొనుగోలులో అక్రమాలు జరిగాయని తీవ్ర ఆరోపణలు రావడంతో తరువాత ప్రభుత్వాలు వీటి కొనుగోలుకు వెనకడుగు వేశాయి. చివరిసారిగా 2000 సంవత్సరంలో ‘ఐఎన్ఎస్ సింధురాష్ట్ర’ అనే సంప్రదాయ జలాంతర్గామి భారత నౌకాదళంలో చేరింది. ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, భారత నావికాదళాధిపతి అడ్మిరల్ సునీల్ లాంబ, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, భారత నావికాదళ సీనియర్ అధికారులు, ఫ్రాన్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో