మరోసారి ఏఎమ్ రత్నంకు పూర్వ వైభవం
- November 16, 2015
ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ నిర్మాణ సంస్థగా పేరున్న సూర్య మూవీ ఇటీవల కాలంలో ఆ జోరు చూపించలేకపోతుంది. శంకర్ లాంటి టాప్ డైరెక్టర్స్ తో వరుస బ్లాక్ బస్టర్స్ అందించిన నిర్మాత ఏఎమ్ రత్నం.. తర్వాత ఆ స్ధాయి విజయాలు సాధించలేకపోయాడు. ముఖ్యంగా ఒక కొడుకును హీరోగా, మరో కొడుకును దర్శకుడిగా పరిచయం చేసిన రత్నం, వారిని ఇండస్ట్రీలో నిలబెట్టే క్రమంలో తీవ్రంగా నష్టపోయాడు. దీంతో చాలాకాలం సినిమాలకు దూరంగానే ఉండిపోయాడు. ఇటీవలే తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన రత్నం, ప్రస్తుతం మళ్లీ మంచి ఫాంలోకి వచ్చినట్టుగానే కనిపిస్తున్నాడు. తన పాత బ్యానర్ శ్రీ సూర్యా మూవీస్ కలిసి రాలేదనుకున్నాడో ఏమో గాని, రీ ఎంట్రీలో కొత్త బ్యానర్ మీద సినిమాలు చేస్తున్నాడు. తన కూతురుని నిర్మాతగా పరిచయం చేస్తూ శ్రీ సాయిరామ్ క్రియేషన్స్ బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తున్నాడు. అజిత్ హీరోగా తెరకెక్కిన ఆరంభం సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన రత్నం తరువాత, వరుసగా ఎన్నై అరిందాల్, వేదలం సినిమాలను అజిత్ హీరోగానే తెరకెక్కించాడు. ఈ మూడు సినిమాలు భారీ విజయాలు నమోదు చేయటంతో ఏఎమ్ రత్నం చాలా ఆనందం గా ఉన్నాడు. 40 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన వేదలం ఫస్ట్ వీకెండ్ లోనే సినిమా బడ్జెట్ కన్నా ఎక్కువ వసూళ్లను రాబట్టింది. భారీ వర్షాలు పడుతున్నా, ఇప్పటికీ మంచి కలెక్షన్లు వస్తుండటంతో ఈ సినిమా లాంగ్ ర న్ లో వంద కోట్ల వసూళ్లు రాబట్టడం ఖాయంగా కనినిస్తోంది. దీంతో మరోసారి ఏఎమ్ రత్నంకు పూర్వ వైభవం రావడం ఖాయం అంటున్నారు కోలీవుడ్ సినీ అభిమానులు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







