అజ్ఞాతవాసి ఆడియో కు గెస్ట్ గా విచ్చేయనున్న తారక్
- December 14, 2017
సినిమా ఇండస్ట్రీ లో ఒకప్పుడు విబేధాలు ఎలా ఉండేవో కొత్తగా గుర్తు చేసుకోనవసరం లేదు. బయట ఫ్యాన్స్ మధ్యలోనే కాదు, సినిమాల్లో కూడా ఒకళ్ళ కుటుంబం గురించి ఇంకొకళ్ళు కామెంట్లు బహిరంగంగా చేసుకుంటూ పోయేవారు. కాని , ఆ ట్రెండ్ ఈ మధ్యన కాస్త మారినట్టే కనిపిస్తోంది. గత నాలుగు అయిదు సంవత్సరాలుగా అందరి ఫంక్షన్ లకు అందరూ రావడం , యువ హీరోలు అందరూ వీకెండ్ పార్టీలకు హాజరు అవ్వడం ఒక కొత్త ట్రెండ్ గా మారిపోయింది.
అయితే ఇప్పుడు ఆ ట్రెండ్ మరో మలుపు తిరుగుతోందా , అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కొణిదెల - నందమూరి. ఈ ఇరువురి మధ్య మాటలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవ్వరికి కొత్త కాదు. అలాగే , సినిమాల్లో కూడా ఒకళ్ళ సినిమాల్లో ఇంకొకళ్ళు కలిసి పని చేయడం అనేది ఇప్పటివరకు జరగలేదు. అలాంటిది మొట్ట మొదటి సారిగా ఎవ్వరూ ఊహించని విధంగా ఒక నందమూరి హీరో కొణిదెల వారి ఫంక్షన్ కు అతిధి గా రాబోతున్నారు. అతనెవరో కాదు , యంగ్ టైగర్ NTR.
త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి సినిమా ఆడియో ఫంక్షన్ వేదికగా ఈ విషయం బయటికి వచ్చింది. గతంలో చిరంజీవి ప్రజా రాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఎన్టీఆర్ చిరంజీవి ని బహిరంగగానే విమర్శించారు. అలాగే అదే పార్టీ ప్రచారంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు పైన ఎన్టీఆర్ పైన బాగానే విసుర్లు విసిరారు. ఇప్పుడు రోజులు మారాయేమో, లేదా త్రివిక్రమ్ మాయో తెలియదు. మొన్న ఈ మధ్యనే ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ తీస్తున్న సినిమాకి క్లాప్ ఇవ్వడానికి పవన్ కళ్యాన్ వచ్చేసాడు. ఇప్పుడు కూడా అందుకు కృతఘ్నతగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ అజ్ఞాతవాసి ఆడియో రిలీజ్ కి రావాలని త్రివిక్రమ్ డిమాండ్ చేసినట్టు, దానికి అనుగుణంగా ఎన్టీఆర్ కూడా సరే అన్నట్టు సమాచారం. మొత్తానికి ఎంతో కాలంగా అందరూ ఎదురుచూస్తున్న కలయిక ఇప్పుడు నిజం కాబోతున్నది అన్నమాట.
ఇదే నిజంగా జరిగితే ఫ్యాన్స్ కు నిజంగా పండగే.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల