బాలీవుడ్ ట్రాజిక్ హీరోయిన్ పాత్రలో సన్నీలియోన్
- December 14, 2017
ఒకప్పుడు బాలీవుడ్ లో తన అందచందాలలో ఎంతో మంది అభిమానం సంపాదించారు బాలీవుడ్ నటి మీనా కుమారి. బాలీవుడ్ లో ఒక్క వెలుగు వెలిగిపోయిన మీనా కుమారి జీవితంలో ఎన్నో వొడిదుడుకులు ఎదుర్కొన్నారు..ఆమె చివరి రోజుల్లో దుర్భర జీవితం అనుభవించారు. అందుకే ఆమెను బాలీవుడ్ లో ట్రాజెడీ క్వీన్ అని పిలుస్తారు. అలనాటి బాలీవుడ్ తార మీనా కుమారి పాత్రలో సన్నీలియోన్ కనపడనుంది. మీనా కుమారి తాగుడుకు బానిసై ఏ విధంగా చనిపోయారో అదే ఈ సినిమాలో చూపించబోతున్నామని చెప్పారు.
ఆమె పాత్రలో నటించే ధైర్యం ఒక్క సన్నీ లియోన్‌కు మాత్రమే ఉందని కరణ్ జార్దన్ అన్నారు. అసలు ఈ కథను తొలుత విద్యాబాలన్, మాధురి దీక్షిత్‌కు వినిపించామని, అయితే వాళ్లు వ్యక్తి గత కారణాలతో ఒప్పుకోలేదని చెప్పారు. మీనా కుమారి `సాహిబ్ బీబీ ఔర్ గులాం`, `పాకీజా`, `మేరే అప్నే`, `ఆర్తి`, `పరిణీత` వంటి క్లాసిక్ హిట్స్‌లో నటించిన సంగతి తెలిసిందే.ఈ సినిమా దర్శకుడు కరణ్ రాజ్దాన్ తాజాగా మాట్లాడుతూ... సన్నీ లియోన్‌కు అర్థమయ్యేలా తాను స్క్రిప్ట్ వివరించానని అన్నారు.
మొదట ఈ పాత్రకు సన్నీని తీసుకోవాలని అనుకోలేదని, కథ చెప్పగానే సన్నీలియోన్ మాత్రం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నట్లు కనిపించిందని తెలిపారు. అలనాటి నటి మీనాకుమారి మద్యానికి బానిసై మృతి చెందిన విషయాన్ని తాము చూపిస్తామని చెప్పారు. వాస్తవానికి వివాదాస్పద బయోపిక్‌లో సన్నీ నటిస్తుంది అన్నది ఎవరూ ఊహించనిది.
ఆ ధైర్యం తనకే ఉందని దర్శకుడు చెబుతున్నారు. దీన్నిబట్టి అసలు మీనాకుమారి గా నటిస్తే వివాదాలు ఎదురవుతాయనే సదరు నాయికలు అంగీకరించి ఉండరని అర్థమవుతోంది. ఈ సినిమా చేయాలని సన్నీ లియోన్ చాలా కాన్ఫిడెన్స్‌గా ఉన్నట్లు కరుణ్ జోర్దన్ అన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల