శేఖర్ కమ్ములతో విజయ్ దేవరకొండ
- December 14, 2017
డైరెక్టర్ శేఖర్ కమ్ముల.. హీరో విజయ్ దేవరకొండ లైమ్‌లైట్‌లోకి వచ్చేశారు. 'ఫిదా'తో యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి మార్కులు కొట్టేశాడు శేఖర్. దీంతో ఆయన నెక్ట్స్ మూవీ ఏంటి? అన్నదానిపై ఫిల్మ్ సర్కిల్స్‌లో రకరకాల వార్తలు హంగామా చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ వార్త బయటికి వచ్చింది. రీసెంట్‌గా విజయ్ దేవరకొండని కలిసి స్టోరీ లైన్ వినిపించాడట డైరెక్టర్ శేఖర్ కమ్ముల. అది హీరోకి నచ్చడంతో స్టోరీని డెవలప్ చేసే పనిలోపడ్డాడు ఆయన. దీనికి ప్రొడ్యూసర్ ఎవరనేది ఆసక్తికరంగా మారింది.
ఫిదా సమయంలో దిల్‌రాజు బ్యానర్‌లో మరో మూవీ చేస్తానని శేఖర్ మాట ఇచ్చాడు. ఈ లెక్కన విజయ్- శేఖర్ కాంబో.. రాజు బ్యానర్‌లో వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. మొత్తానికి ఓకే అయితే ఈనెల నాటికి ఓ స్టేట్‌మెంట్ వచ్చే అవకాశముంది. ప్రస్తుతం విజయ్ ఆల్రెడీ పరశురామ్‌తో ఓ ఫిల్మ్ చేస్తున్నాడు.
క్రాంతిమాధవ్, నందినీరెడ్డి, రాహుల్ దర్శకత్వంలో వరుస సినిమాలు చేయనున్నాడు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల