రామ్ చరణ్ ఇంట్లో శర్వానంద్, సందీప్‌రెడ్డి సందడి

- December 14, 2017 , by Maagulf
రామ్ చరణ్ ఇంట్లో శర్వానంద్, సందీప్‌రెడ్డి సందడి

హైదరాబాద్: హీరో రామ్ చరణ్ నివాసంలో హీరో శర్వానంద్, అర్జున్‌రెడ్డి దర్శకుడు సందీప్‌రెడ్డి సందడి చేశారు. రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఏర్పాటు చేసిన ప్రీ క్రిస్మస్ వేడుకలో వాళ్లు పాల్గొన్నారు. ఉపాసన స్వయంగా విస్తరాకులతో క్రిస్మస్ చెట్టును తయారుజేశారు. ఈ సందర్భంగా రామ్ చరణ్‌, శర్వానంద్, సందీప్‌రెడ్డి ఫొటోలు దిగారు. ఈ ఫొటోలను ఉపాసన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. మిస్టర్ 'సి'తో ఉన్న వ్యక్తులను గుర్తించండి అంటూ ఆమె ట్వీట్ చేశారు. ప్రస్తుతం రామ్‌చరణ్ రంగస్థలం సినిమాలో నటిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com