రేపు కార్నిచ్ రహదారి మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు తాత్కాలిక మూసివేత
- December 14, 2017
దోహా:కతర్ జాతీయ దినోత్సవ కార్యక్రమ తుది దశ రిహార్సల్ నిర్వహణ నిమిత్తం కార్నిచ్ రహదారిని తాత్కాలికంగా మూసివేతను అమలు చేయనున్నారు. రేపు శుక్రవారం, డిసెంబర్ 15 వ తేదీ 2017 మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ మూసివేత కొనసాగనుందని కతర్ జాతీయ దినోత్సవ కార్యక్రమాల నిర్వహణ సంఘం ఒక ప్రకటనలో తెలిపింది.షెరాటన్ సిగ్నల్స్ నుండి ఇస్లామిక్ ఆర్ట్ సిగ్నల్ మ్యూజియమ్ వరకు రెండు దిశలలో నేషనల్ డే పెరేడ్ యొక్క రిహార్సల్ నిర్వహించనున్నట్లు ఆంతరంగిక మంత్రిత్వ శాఖ తన అధికార ట్విట్టర్ ఖాతాలో ప్రకటించింది. వారు ఈ మూడు-గంటల సమయాల్లో సూచించబడిన వేరే ఇతర ప్రత్యామ్నాయ మార్గాల్లో వాహనాలను మళ్లించాలని ఆ ప్రకటనలో కోరారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల