అమరావతి డిజైన్లకు మంచి స్పందన.. అసెంబ్లీ అదుర్స్..
- December 14, 2017
అమరావతికే తలమానికంగా ఉండబోతోంది అసెంబ్లీ. 250 మీటర్ల ఎత్తులో నిర్మించనున్న ఐకానిక్ టవర్‌లో తెలుగు సాంస్కృతిక వైభవం కనిపించబోతోంది. నార్మన్ ఫోస్టర్స్ ఇచ్చిన టవర్ డిజైన్‌కే ప్రజామోదం లభిస్తోంది. అధికారులతో చర్చించి డిజైన్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు సీఎం చంద్రబాబు. ఇక అమరావతి నిర్మాణంపై భారీ వర్క్‌షాప్ నిర్వహిస్తోంది CRDA.
అమరావతి నిర్మించబోయే అసెంబ్లీకి టవర్ డిజైనే దాదాపు ఖరారైంది. నార్మన్ ఫోస్టర్ సంస్థ ఇచ్చిన రెండు ఆకృతుల్లో టవర్ డిజైన్‌కే సీఎం చంద్రబాబు సహా మంత్రులు, సీఆర్డీఏ అధికారులు ఓకే చెప్పారు. అయినా దీనిపై ప్రజల అభిప్రాయం తీసుకునేందుకు డిజైన్లను వెబ్ సైట్లో పెట్టింది ప్రభుత్వం. ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. గురువారం రాత్రి వరకు టవర్ డిజైన్‌కే ఎక్కువ మంది ఓటు వేశారు. సర్వే ఫలితాలతో మరోసారి సీఎం చంద్రబాబుతో చర్చించి డిజైన్ ఫైనల్ చేయనుంది సీఆర్డీఏ. రాజధాని నిర్మాణాలకు నార్మన్ ఫోస్టర్ ఇచ్చిన డిజైన్లు అద్భుతంగా ఉన్నాయన్నారు మంత్రి నారాయణ. ప్రపంచంలోని నగరాల్లో అమరావతి టాప్ ఫైఫ్ ప్లేస్‌లో ఉంటుందన్నారు.
అసెంబ్లీని సుమారు 11 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. ఇందులో 250 మీటర్ల ఎత్తైన టవర్ నిర్మించనున్నారు. ఈ టవర్ లో 70 మీటర్ల ఎత్తు వరకూ ప్రజలు వెళ్లి అక్కడి నుంచి మొత్తం రాజధానిని చూసే అవకాశం ఉంటుంది. అమరావతిలో నిర్మించనున్న అసెంబ్లీకి సినీ దర్శకుడు రాజమౌళి ఇచ్చిన కాన్సెప్ట్‌ను.. టీవీ5 ఎక్స్‌క్లూజివ్‌గా సంపాదించింది. నార్మన్ ఫోస్టర్ రూపొందించిన డిజైన్‌లోని భవనం మధ్యలో తెలుగు తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసి.. దానిపైకి సూర్యకిరణాలు పడేలా కాన్సెప్ట్ రూపొందించారు రాజమౌళి. అరసవెల్లి సూర్యదేవాలయం, చిత్తూరు జిల్లాలోని గుడిమల్లంలోని ఆలయాల్లో సూర్య కిరణాలో గర్భగుడిని తాకే కాన్సెప్ట్ ఆధారంగా దీన్ని రూపొందించానన్నారు బాహుభళి డైరెక్టర్
హైకోర్టు కోసం ఇప్పటికే ఆమోదించిన బౌద్ధ స్థూపాకారపు డిజైన్‌ను మరింత ఆకర్షణీయంగా మలచాలని ప్రభుత్వం భావిస్తోంది. పరిపాలనా నగరపు మాస్టర్ ప్లాన్‌లోనూ కొన్ని మార్పులు చేసింది. అమరావతి నిర్మాణంలోని వివిధ అంశాలపై నిపుణులతో విజయవాడలో భారీ వర్క్ షాపు నిర్వహిస్తోంది సీఆర్డీయే. తొలిరోజు సమావేశంలో రాజధాని నిర్మాణం, మౌలికవసతుల కల్పనపై చర్చించారు. ప్రపంచ స్థాయి నగరంగా అమరావతి ఉండబోతుందని ఏపీ అధికారులు తెలిపారు. సంక్రాంతి కల్లా అసెంబ్లీ, హైకోర్ట్ భవనాలకు శంకుస్థాపన చేయాలనుకుంటున్న ప్రభుత్వం.. వీలైనంత త్వరగా టెండర్లను పూర్తి చేసి.. పనులను మొదలుపెట్టనుంది.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!