జనవరి 12న జై సింహ రిలీజ్

- December 15, 2017 , by Maagulf
జనవరి 12న జై సింహ రిలీజ్

బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం జైసింహా. నయనతార, నటాషా జోషీ, హరిప్రియ నాయికలుగా నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు కేఎస్‌ రవికుమార్‌ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సి. కళ్యాణ్‌ నిర్మాత. ఇటీవల పాటల చిత్రీకరణతో జైసింహా షూటింగ్‌ పూర్తి చేసుకుంది. త్వరలో ఆడియో కార్యక్రమాన్ని నిర్వహించున్నారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించారు. చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా నిర్మాత సి. కళ్యాణ్‌ మాట్లాడుతూ.దుబాయ్‌లో రెండు పాటల చిత్రీకరణతో జైసింహా షూటింగ్‌ మొత్తం పూర్తయింది. బాలకృష్ణ, నయనతార, నటాషా జోషీలపై ఈ పాటలను రూపకల్పన చేశాం. జానీ, బృంద మాస్టర్‌ల నేతృత్వంలో యురోపియన్‌ డాన్సర్‌లతో తెరకెక్కించిన ఈ పాటలు జైసింహాలో ప్రత్యేక ఆకర్షణ అవుతాయి. చిరంతన్‌ భట్‌ మంచి సంగీతాన్ని అందిం చారు. డిసెంబర్‌ నెలాఖరకు పాటల విడుదల కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ముందు నిర్ణయించినట్లు జనవరి 12న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com