ఒక వినూత్న ప్రేమ కథగా..
- December 15, 2017
సంగీత దర్శకుడు శ్రీ కుమారుడు రాజేష్ శ్రీ చక్రవర్తి కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం శివకాశీపురం. ప్రియాంకా శర్మ నాయికగా నటిస్తోంది. సాయి హరీశ్వరా ప్రొడక్షన్స్ పతాకంపై మాస్టర్ హరి సమర్పణలో పులిమామిడి మోహన్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హరీష్ వట్టికూటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలో సెన్సార్ పూర్తిచేసి విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఈలోగా ప్రచార కార్యక్రమాలు మొదలు పెట్టారు. పవన్ శేష సంగీతాన్నందించిన పాటలు చిత్రానికి ఆకర్షణ కాబోతున్నాయి. ఇప్పటికే రెండు పాటలు విడుదలవగా.మూడో పాటను తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ రామ్మోహన్‌రావు చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎఫ్‌డీసీ ఛైర్మన్ రామ్మోహన్‌రావు మాట్లాడుతూ..శివకాశీపురం చిత్రాన్ని మంచిర్యాల ప్రాంతంలో ఎక్కువగా చిత్రీకరణ జరిపామని, షూటింగ్ కోసం అక్కడి ప్రజలు ఎంతో సహకరించారని దర్శక నిర్మాతలు చెబుతుండటం సంతోషకరం. అక్కడే కాదు చిత్రీకరణలకు ఎక్కువ శాతం తెలంగాణ ప్రజలు సహకరిస్తారు. చిత్ర నిర్మాణం కంటే బాధ్యతగా విడుదలకు ప్రయత్నాలు చేసుకోవాలి. సరైన సమయంలో ప్రేక్షకుల ముందుకు చిత్రాన్ని తీసుకురావాలి. శివకాశీపురం విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. అన్నారు. దర్శకుడు హరీష్ వట్టికూటి మాట్లాడుతూ.సినిమా సెన్సార్‌కు సిద్ధంగా ఉంది. త్వరలో సెన్సార్ పూర్తి చేసి జనవరి లేదా ఫిబ్రవరిలో మా చిత్రాన్ని తెరపైకి తీసుకొస్తాం. పవన్ శేష సాయి సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ అవుతుంది. తన సహకారం అందిస్తున్న రామ్మోహన్ గారికి కృతజ్ఞతలు. అన్నారు.
నిర్మాత పులిమామిడి మోహన్‌బాబు మాట్లాడుతూ.ఎఫ్‌డీసీ ఛైర్మన్ రామ్మోహన్‌రావు గారి చేతుల మీదుగా మా చిత్ర మూడో పాట విడుదల కావడం సంతోషంగా ఉంది. మంచిర్యాలలో చిత్రీకరణ జరుపుకుంటున్న సమయంలో రామ్మోహన్‌రావు గారి కుటుంబ సభ్యులు ఎంతో సహకారం అందించారు. అన్నారు. ఈ కార్యక్రమంలో పాటల రచయిత చంద్రమౌళి పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







