ఇకపై విశాఖ విమానాశ్రయంలోనూ విదేశీయులకు 'వీసా ఆన్‌ అరైవల్‌'

- December 15, 2017 , by Maagulf
ఇకపై విశాఖ విమానాశ్రయంలోనూ విదేశీయులకు 'వీసా ఆన్‌ అరైవల్‌'

అమరావతి: విదేశీయులు ఆంధ్రప్రదేశ్‌కు రావాలంటే ఇక మీదట వీసా ముందే తీసుకుని రావాల్సిన అవసరం ఉండదు. 'వీసా ఆన్‌ అరైవల్‌' కోసం ఆన్‌లైన్‌లో ముందుగా దరఖాస్తు చేసుకుని వచ్చేయవచ్చు. విశాఖపట్నం విమానాశ్రయంలో దిగాక అక్కడికక్కడే వీసా పొందవచ్చు. ఇందుకు వీలుకల్పిస్తూ... విశాఖపట్నంలో 'వీసా ఆన్‌ అరైవల్‌' జారీ చేసేందుకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ అనుమతిచ్చింది. ఈ మేరకు కేంద్రం నుంచి రాష్ట్రానికి సమాచారమందింది. ఇది వెంటనే అమల్లోకొస్తుందని, సంబంధిత అధికారులు తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. కేంద్రం తాజా నిర్ణయంతో రాష్ట్రానికి విదేశీ పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఇకమీదట 147 దేశాల నుంచి విదేశీ పర్యాటకులు వీసా లేకుండానే నేరుగా విశాఖకు వచ్చి, వీసా తీసుకుని రాష్ట్రమంతా పర్యటించవచ్చని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిల తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ సౌకర్యం 17 విమానాశ్రయాల్లోనే ఉండగా ఇప్పుడు విశాఖను అందులో చేర్చినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com