ఈనెల 27న విదుదలకు సిద్ధం అవుతున్న 'తను నేను'..!!
- November 17, 2015
ష్టాచమ్మా, గోల్కొండ హైస్కూల్, ఉయ్యాలా జంపాలా వంటి సూపర్‌హిట్ చిత్రాలను నిర్మించిన రామ్మోహన్ పి. ఇప్పుడు దర్శకుడుగా మారారు. అవికా గోర్ హీరోయిన్గా, 'వర్షం' దర్శకుడు శోభన్ తనయుడు సంతోష్ శోభన్ హీరోగా డి.సురేష్‌బాబు సమర్పణలో సన్‌షైన్ సినిమా, వయాకామ్ 18 పిక్చర్స్ పతాకాలపై స్వీయ దర్శకత్వంలో రామ్మోహన్ పి. నిర్మిస్తున్న లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం 'తను నేను'. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. దీపావళి కానుకగా రిలీజైన టీజర్‌కి చక్కని స్పందన వచ్చింది. ఈనెల 27న ఈ సినిమా రిలీజవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో చిత్రయూనిట్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ప్రముఖ నిర్మాత డి.సురేష్ బాబు, యంగ్ హీరోలు నాని, రాజ్ తరుణ్‌లు హాజరయ్యారు. అవికా గోర్, సంతోష్ శోభన్, రవిబాబు, సత్యకృష్ణ, కిరీటి దమ్మరాజు, ఆర్.కె. మామ, రాజశ్రీనాయుడు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సన్నీ ఎం.ఆర్., సినిమాటోగ్రఫీ: సురేష్ సారంగం, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, ఆర్ట్: ఎస్.రవీందర్, నిర్మాణం: సన్‌షైన్ సినిమాస్ ప్రై. లిమిటెడ్, వయాకామ్ 18 పిక్చర్స్ లిమిటెడ్, సమర్పణ: డి.సురేష్‌బాబు, నిర్మాత-దర్శకత్వం: రామ్మోహన్ పి.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







