మెగా ఫ్యామిలీతో కృష్ణంరాజు వియ్యం... సోషల్ మీడియాలో హల్చల్
- December 16, 2017
టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రెబల్ స్టార్ ప్రభాస్. ప్రభాస్ పెళ్లి పై అనేక రకాల వార్తలు షికారు చేస్తూనే వున్నాయి. బాహుబలి సినిమా పూర్తి అయ్యాక ప్రభాస్ పెళ్లి అని పెద్దనాన్న కృష్ణంరాజు ప్రకటించిన తరువాత అనేక వార్తలొచ్చాయి. భీమవరం అమ్మాయితో అని ఒకసారి, వైజాగ్ బిజినెస్ మ్యాన్ కుమార్తె తో ముహుర్తం ఖరారు అని మరోసారి పుకార్లు షికారు చేసాయి. కాగా దుబాయ్ సినీ క్రిటిక్ ప్రభాస్ అనుష్కల ప్రేమ త్వరలో పెళ్లి అని ట్విట్ తో సంచలనం సృష్టించాడు. ఈ నేపథ్యంలో కృష్ణంరాజు ప్రభాస్ పెళ్లి పై క్లారిటీ ఇచ్చాడు . ఇప్పటికే ప్రభాస్ కు పెళ్లి సంబంధాలు చూస్తున్నట్లు జాతాకాలు ముఖ్యమని హింట్ ఇచ్చాడు. తాజాగా సరికొత్త పుకారు షికారు చేస్తుంది. కృష్ణంరాజు మెగా ఫ్యామిలీతో వియ్యం అందేందుకు రెడీ అవుతున్నట్లు ఫిల్మినగర్ లో టాక్. మొగళ్తూరు నుంచి వచ్చిన కృష్ణంరాజు చిరంజీవిల మధ్య మంచి స్నేహ సంబంధాలున్నాయి. దీంతో మెగా ఫ్యామిలీకి చెందిన నిహారికా ప్రభాష్ ల పెళ్లి జరిగితే బాగుంటుందని కొందరి సన్నిహితుల అభిప్రాయమట. ఈ విషయం కృష్ణంరాజుకి సన్నిహితులు చెప్పగా చిరంజీవితో మాట్లాడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. సాహో షూటింగ్ లో బిజీగా వున్న ప్రభాష్ స్పందించాల్సి వుంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల