నాల్గవ షెడ్యూల్ పూర్తి చేసుకున్న 'సమరం' సినిమా
- December 16, 2017
యూనివర్సల్ ఫిలిమ్స్ బ్యానర్ పై జివిఎస్ నిర్మాణంలో బషీర్ ఆలూరి దర్శకుడుగా.. సాగర్, ప్రగ్యా హీరో హీరోయిన్స్ గా, సుమన్, వినోదకుమార్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం 'సమరం'. ఈ చిత్రం నాల్గవ షెడ్యూల్ షూటింగ్ ని పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా దర్శకుడు బషీర్ మాట్లాడుతూ.. మా చిత్ర షూటింగ్ కి సంబంధించి నాల్గవ షెడ్యూల్ పూర్తయింది. యాక్షన్, రొమాంటిక్ లవ్ స్టొరీ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫ్యామిలీ మొత్తం కలసి చూసేలా ఉంటుంది. అన్ని కమర్షియల్ హంగులు ఉంటాయి. నాకు సహకరిస్తున్న సమరం చిత్ర యూనిట్ కు కృతజ్ఞతలు అని అన్నారు.
హీరో సాగర్ మాట్లాడుతూ.. షూటింగ్ కి సంబంధించి రెండు పాటలు, నాలుగు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ చిత్రాన్ని సపోర్ట్ చేయమని కోరుతున్నా.. అని అన్నారు.
నటుడు వినోద్ కుమార్ మాట్లాడుతూ.. ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు దర్శక నిర్మాతలకు నా కృతజ్ఞతలు. ఒక మంచి సినిమాకి ఉండాల్సిన అన్ని లక్షణాలు ఈ సమరం చిత్రంలో ఉన్నాయి. నిర్మాత కొత్త అయినా అనుభవం ఉన్న నిర్మాతలా అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు. సరైన సమయం చూసి సినిమాను విడుదల చేస్తే మంచి విజయం సాధిస్తుంది. తెలుగు పరిశ్రమలో సమరం అనే మంచి సినిమా వస్తోంది దయచేసి సపోర్ట్ చేయండి అన్నారు.
నటుడు రామ్ జగన్ మాట్లాడుతూ.. ఫుల్ లెంగ్త్ పాత్రలో వినోద్ కుమార్ గారితో ట్రావెల్ అయ్యే పాత్ర నాది. సమరం సినిమా త్వరగా పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందుకు రావాలని ఆశిస్తున్నా అన్నారు .
సాగర్, ప్రగ్యా, వినోద్, సుమన్ , రాంజగన్, ప్రభావతి, రాగిణీ, అప్పారావు(జబర్దస్త్) ఎస్ ఎ. వేణుగోపాల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి స్టోరీ-డైలాగ్స్: నండూరి విరేశ్, ఎడిటర్: శ్రీను బాబు, సంగీత దర్శకుడు: రాజ్ కిరణ్, డైరెక్టర్: బషీర్ ఆలూరి, కెమెరా: నాగబాబు కర్ర, నిర్మాత: జి.వి.ఎస్.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల