20 వృత్తులలో ఉద్యోగ భర్తీకి విద్యా మంత్రిత్వ శాఖ నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత కావాల్సిందే
- December 16, 2017
కువైట్: ప్రభుత్వం నిర్వహించే పరీక్షలో పాస్ కాబడితేనే ఇకపై కువైట్ లో కొన్ని ఉద్యోగాలు దక్కనున్నాయి. 20 వృత్తులలో అభ్యర్థులను వివిధ ఉద్యోగాలలో భర్తీ చేసుకొనేందుకు నియామక నిబంధనలను మానవ వనరుల పబ్లిక్ అథారిటీ ఏర్పాటుచేసిందని విశ్వసనీయ సమాచారం ద్వారా వెల్లడికాబడింది.. విద్యా మంత్రిత్వ శాఖతో ఒక ఒప్పందం ప్రకారం ఒక పరీక్షలో వారు ఉత్తీర్ణులు కావడం ద్వారా ఉద్యోగులను నియమించుకొనున్నారు.గత ఆరు నెలల్లో 260 మంది ప్రత్యేక అవసరాలు గల ఉపాధ్యాయులు, 110 మంది అసిస్టెంట్ ఉపాధ్యాయులు, ప్రత్యేక అవసరాలు గల 15 మంది సామాజిక కార్యకర్తలు, 20 మంది మనోరోగ వైద్యులతో కలిపి మొత్తం 200 మందికి ఉద్యోగావకాశాలు లభించాయని అధికారులు పేర్కొన్నారు .మెకానిక్స్, ఆటోమొబైల్ ఇంజనీర్స్, పెయింటర్లు మరియు వంటవాళ్లు తదితరుల నుండి 30 అప్లికేషన్లు రాగా వాటిలో 15 దరఖాస్తులు ప్రస్తుత నియమ నిబంధనలకు సరిపోనున్నాయి.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







