జనవరిలో కొత్త వంతెన ప్రారంభం: కరామాలో తగ్గనున్న ట్రాఫిక్ ఇబ్బందులు
- December 16, 2017
దుబాయ్‌లో 'బాటిల్ నెక్స్' ట్రాఫిక్ సమస్యలకు కారణమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కరామా వద్ద షేక్ ఖలీఫా బిన్ జాయెద్ స్ట్రీట్‌లో నిర్మితమవుతోంది ఓ నూతన వంతెన. ఇది జనవరిలో అందుబాటులోకి రానున్నట్లు రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ) బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఛైర్మన్, డైరెక్టర్ జనరల్ మట్టర్ అల్ తాయెర్ చెప్పారు. 2018 రెండో క్వార్టర్లో అల్ గర్హౌద్ మరియు మినా రషీద్‌ని కలిపే టన్నెల్‌ని ప్రారంభించనున్నట్లు వివరించారు అల్ తాయెర్. ఈ పనులు 70 శాతం ఇప్పటికే పూర్తయ్యాయని అన్నారాయన. ప్రాజెక్ట్‌ని పర్యవేక్షించిన సమయంలో అల్ తాయెర్ ఈ విషయాల్ని వెల్లడించారు. ట్రాఫిక్ ఇబ్బందుల్ని తగ్గించి, వాహనాల మూమెంట్‌ని మరింత స్మూత్‌గా మార్చేందుకు ఎప్పటికప్పుడు నిపుణుల సలహాలు, సూచనలతో మాస్టర్ ప్లాన్స్‌లో మార్పులు చేస్తున్నామని అల్ తాయెర్ వివరించారు.
తాజా వార్తలు
- బ్రేకింగ్: సంక్షోభంలోనూ స్థిరంగా బంగారం..ఇన్వెస్టర్లను ఊరిస్తున్న మార్కెట్!
- చిన్ననోట్ల కోసం ప్రత్యేక ఏటీఎంలు, కేంద్రం కీలక నిర్ణయం
- ఇరాన్ తో యుద్ధం..అమెరికా సంచలన ప్రకటన..
- హైదరాబాద్‌లో అగ్నిప్రమాదం, చార్మినార్ వద్ద ముగ్గురికి గాయాలు
- సౌదీ నుంచి క్షేమంగా బయలుదేరిన 59 మంది తెలుగు ప్రవాసులు
- ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ రాజీనామా
- 'మేము ఇక్కడ సురక్షితం'-యుద్ధ సమయంలోనూ ఇరానియన్లకు అండగా నిలుస్తున్న యూఏఈ ప్రజలు!
- విదేశాల్లో చిక్కుకుపోతే కంపెనీ జీతం ఆపేయవచ్చా?
- యూఏఈలో కూరగాయల ధరల పెరుగుదల తాత్కాలికమే
- అమరావతి స్పోర్ట్స్ సిటీపై సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు!









