21న కాకినాడలో ఎ.ఆర్.రెహమాన్ లైవ్ కాన్సర్ట్
- December 17, 2017
ఆంధ్రప్రదేశ్ టూరిజానికి కొత్త పాలసీ ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. పర్యాటకలను ఆకర్షించేలా జాతీయ స్థాయి ఈవెంట్లను ప్లాన్ చేస్తోంది. కొద్ది రోజుల కిందట సోషల్ మీడియా అవార్డుల వేడుకను నిర్వహించిన టూరిజం శాఖ.. ఈ నెలలో కాకినాడలో రెహమాన్ కాన్సర్ట్‌ను ఏర్పాటు చేసింది. టూరిజంలో ఆంధ్రప్రదేశ్‌కు అందిపుచ్చుకున్నన్ని అవకాశాలు ఉన్నాయని భావిస్తున్న ప్రభుత్వం... ఆ దిశగా పకడ్బందీగా ప్రణాళికలు వేసుకుంటోంది. కొత్త టూరిజం పాలసీతో పెట్టుబడిదార్లను ఆకర్షించేందుకు సిద్దమవుతోంది. దీనికి సంబంధించి ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ టూరిజం పాలసీని టూరిజం శాఖ సిద్దం చేసింది. ముఖ్యమంత్రి ఆమోదం పొందిన తర్వాత అధికారికంగా ప్రకటించనున్నారు.
దేశవిదేశీ పర్యాటకులను ఆకట్టుకునేలా ఈవెంట్లను నిర్వహించేందుకు టూరిజం శాఖ ప్రణాళికలు సిద్దం చేసింది. కొద్ది రోజుల క్రితం అమరావతిలో సోషల్ మీడియా అవార్డుల వేడుకను ఘనంగా నిర్వహించింది. దీపికా పదకొనేలాంటి సూపర్ స్టార్‌తో పాటు అనేక మంది సినీతారలు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చారు. సోషల్ మీడియా అవార్డులనే కాన్సెప్టే కొత్తది కావడం... దీపికా పదకొనే రావడంతో ఈ కార్యక్రమం దేశం దృష్టిని ఆకర్షించింది.
ఆ తర్వాత అరకులో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ ... విశాఖ ఉత్సవ్ లాంటి వాటిని నిర్వహించారు. ఈ కోవలో డిసెంబర్ ఇరవై ఒకటో తేదీన ఆస్కార్ అవార్డు విజేత ఎ.ఆర్ రెహమాన్ మ్యూజిక్ కాన్సర్ట్ ను కాకినాడలో ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను చేశారు. ఈ ఈవెంట్‌ను జాతీయ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నారు. పైగా ప్రజలందరూ ఉచితంగా ఈ కాన్సర్ట్‌ను ఆస్వాదించే ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే వారందరికీ మెరుగైన సౌకర్యాలు కల్పించి... టూరిజం శాఖ నిర్వహించే ఈవెంట్లను ఓ బ్రాండ్ తెచ్చేలా ప్రయత్నాలు చేయనున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల