పాకిస్తాన్ చర్చిలో ఉగ్రదాడి, ఐదుగురి మృతి
- December 17, 2017
పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బలూచిస్థాన్‌లోని క్వెట్టా ప్రాంతంలోని చర్చిలోకి ఉగ్రవాదులు చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందగా 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు చర్చి ప్రాంగణం చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. క్రిస్మస్ సమీపిస్తున్న నేపథ్యంలో చర్చిలో ప్రార్థనలు జరుగుతుండగా ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రులకు తరలించారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







