రామ్ చరణ్ కు విలన్ గా వివేక్ ఓబ్రాయ్
- December 17, 2017
రక్త చరిత్ర సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన వివేక్ ఒబెరాయ్..ఆ తర్వాత పలు చిత్రాల్లో కనిపించి అలరించాడు. తాజాగా చరణ్ సినిమాలో విలన్ గా కనిపించబోతున్నాడని వినికిడి. ప్రస్తుతం రామ్ చరణ్ సుకుమార్ దర్శకత్వం లో రంగస్థలం మూవీ లో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇది పూర్తి కాగానే మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం లో ఓ సినిమా చేయబోతున్నాడు. జనవరి , లేదా ఫిబ్రవరి లో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.
కాగా ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు తో పాటు నటి నటుల ఎంపిక చేసే పనిలో బిజీ గా ఉన్నాడు బోయపాటి. అయితే ఈ యాక్షన్ మూవీ లో విలన్ గా బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఆయనకుకథ వినిపించడం , అయన నటించడానికి ఒకే చెప్పడం జరిగిందని తెలుస్తుంది. ఈ చిత్రంలో శివగామి రమ్యకృష్ణ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తుందని సమాచారం. పవన్ కళ్యాణ్.. అల్లు అర్జున్ ల సరసన నటించిన అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్ గా నటించబోతుంది. ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మించబోతున్నాడు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల