కళాతపస్వి విశ్వనాధ్ గారికి జీవిత సాఫల్య పురస్కారం
- December 17, 2017ఎన్నో కళాత్మక చిత్రాలతో తెలుగు వెండితెరను సుసంపన్నం చేసిన సీనియర్ దర్శకులు కళాతపస్పి కె.విశ్వనాథ్ గారిని విజయవాడ నగరంలో ఘనంగా సన్మానించారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయనకు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించారు. రోటరీ క్లబ్ ప్లాటినమ్ జూబ్లీ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 2016-17 సంవత్సరానికి గాను ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ జీవిత సాఫల్య పురస్కార కమిటీ చైర్మన్ డాక్టర్ ఎం.సి.దాస్, రోటరీ పౌరసంబంధాల విభాగం చైర్మన్ పులిపాక కృష్ణాజీ లతో పాటు ఇతర సభ్యులు పాల్గొన్నారు. విజయవాడ గాంధీనగర్‌లోని శ్రీరామ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ వేడుకలో కె.విశ్వనాథ్ చిత్రాల్లో కొన్ని నృత్య సన్ని వేశాలను, పాటలను ప్రదర్శిస్తారని తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్‌లోని మ్యూజియమ్స్.. ఫ్రీ ఎంట్రీ
- చెక్స్ బౌన్స్. పరిహారంగా BD64,000
- 'అబ్షర్' ద్వారా యాక్సిడెంట్ రిపోర్టింగ్, వెహికల్ బదిలీ
- ఒమన్‌లో కొన్ని బ్యాంకు నోట్లు త్వరలోఉపసంహరణ..!
- ఆన్లైన్లో వస్తువులను విక్రయిస్తున్నారా? పోలీసుల హెచ్చరిక
- 1,300 కంపెనీలకు Dh100,000 జరిమానా..!
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్‌కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!