ఎన్ఆర్ఐలు అభివృద్ధిలో భాగస్వాములు కావాలి: కేసీఆర్
- December 17, 2017
హైదరాబాద్: చైనాలో ఆర్థిక సంస్కరణలు తెచ్చిన తర్వాత వివిధ దేశాల్లో స్థిరపడిన చైనీయులే మొదట అక్కడ పెట్టుబడి పెట్టి ఆ దేశాభివృద్ధిలో కీలకంగా నిలిచారని సీఎం కేసీఆర్ తెలిపారు. తెలంగాణ ఎన్ఆర్ఐలు కూడా ఇదే ఒరవడి ప్రదర్శించి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనడానికి 42 దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులకు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పనులను, సంక్షేమ కార్యక్రమాలను, భాషా సంస్కృతిక రంగాల్లో చేస్తున్న కృషిని సీఎం కేసీఆర్ వివరించారు. ఎన్ఆర్ఐలకు ఉద్యమ సమయంలో తెలంగాణ ఎలా ఉండాలని కోరుకున్నామో..ఇపుడు అదేవిధంగా తెలంగాణ దూసుకుపోతున్నదన్నారు. 17.8 శాతం ఆదాయ వృద్ధిరేటుతో దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ నిలిచిందని చెప్పారు. 2024 నాటికి తెలంగాణ బడ్జెట్ రూ.5 లక్షల కోట్లు ఉంటుందని ఆర్థికవేత్తలు అంచనా వేసినట్లు వెల్లడించారు. పథకాల అమలులో సంక్షేమరంగంలో దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచామన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల