ఒమన్ లో విద్యుత్ షాక్ కు గురై ప్రవాసీయుడు మృతి
- December 18, 2017
మస్కట్ : మృత్యువు ఆ ప్రవాసీయుడిని విద్యుత్ తీగల రూపంలో బలికొంది. ఓమన్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఏసిఎడిఏ) తెలిపిన సమాచారం ప్రకారం తీవ్రమైన విద్యుత్ షాక్ కు గురైన ఒక ప్రవాసీయుడు మరణించినట్లు తెలిపింది. మస్కట్ నుండి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్-దహిరా గవర్నైట్లో ఇబ్రి సమీపంలో అకస్మాత్తుగా ఒక వ్యక్తిపై విద్యుత్ స్థంభం కూలిపోవడంతో అత్యవసర సేవలు మరియు ఆసుపత్రి సిబ్బంది అ ప్రవాసీయుని జీవితాన్ని కాపాడటానికి తీవ్రంగా ప్రయత్నించారు. ఆ వ్యక్తిని కాపాడేందుకు హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే ప్రాణాలు కోల్పోయినట్లు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రత్యక్ష సాక్షి అలీ అల్-ఘఫ్రీ మాట్లాడుతూ, " ఒక వ్యక్తి ట్రక్కులో చెత్తను రవాణా చేస్తున్నాడు.వాహనం విద్యుత్ తీగలకు తగిలింది. దాంతో ఆ వ్యక్త్తో తన చేతులతో విద్యుత్ వైర్లను తొలగించటానికి ప్రయత్నించినప్పుడ ఆ వ్యక్తి తీవ్రమైన విద్యుత్ షాక్ గురయ్యాడు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!