తల్లి కలను నెరవేర్చిన చిన్నారి నైనిక

- December 18, 2017 , by Maagulf
తల్లి కలను నెరవేర్చిన చిన్నారి నైనిక

బాలనటి గా వెండి తెరపై అడుగు పెట్టి.. హీరోయిన్ గా స్టార్ డమ్ సొంతం చేసుకొన్న సీనియర్ తార.. "మీనా"..! బాలనటిగా తన నటనతో ఆకట్టుకొన్న మీనా.. కర్తవ్యం సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపించింది.. అనంతరం సీతారామయ్యగారు మనవరాలు సినిమాతో మీనా ప్రేక్షకుల మనసును దోచేసింది.. 1980-90 కాలంలో మీనా దక్షిణాదిలో స్టార్ హీరోయిన్.. చిరంజీవి, కమల్ హాసన్, రజనీకాంత్, నాగార్జున, వెంకటేష్, మోహన్ లాల్. మమ్ముట్టి వంటి స్టార్ హీరోలకు జోడీ కట్టింది.. మీనా పెళ్లి చేసుకొని వెండి తెరకు దూరమై.. మళ్ళీ దృశ్యం సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది.. కాగా మీనా కలను ఆమె కుమార్తె బేబీ నైనిక తీర్చింది అట.. తల్లి బాటలో పయనిస్తూ.. మీనా కూతురు బేబీ నైనిక విజయ్"తెరి" సినిమాతో బాలనటిగా వెండి తెరపై అడుగు పెట్టింది. ఈ సినిమాలో నైనిక నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకున్నది. కాగా తాజాగా చిన్నారి నైనిక 'భాస్కర్ ఒరు రాస్కెల్' అనే చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమాలో అరవింద్ స్వామి, అమల ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. సిద్ధిఖీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ నేపధ్యంలో మీనా ఓ విషయం వెల్లడించింది.. విజయ్ "ఫ్రెండ్స్" సినిమా సిద్ధిఖీ దర్శకత్వంలో తెరకెక్కింది.. ఆ సినిమాలో విజయ్ కు జోడీగా మీనాను తీసుకోవాలని.. దర్శకుడు ఆమెను సంప్రదించాడట.. కానీ డేట్స్ ఖాళీ లేక ఆ సినిమాలో నటించలేదు.. అయితే విజయ్, సిద్ధిఖీ లతో కలిసి చేయాలనే కల నాకు మిగిలిపోయింది.. అయితే తన కలను.. తన కూతురు నైనిక తీర్చింది.. 'తెరి' సినిమాలో విజయ్ తో.. తాజాగా 'భాస్కర్ ఒరు రాస్కెల్' సినిమాతో సిద్ధిఖీ దర్శకత్వంలో నైనిక నటించి... నాకు సంతోషం కలిగిస్తుంది.. అని తన కూతురు గురించి మీనా సంతోషం వ్యక్తం చేసింది.. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com