రాజమౌళి హార్ట్ దోచిన "బ్రేవ్ హార్ట్"
- December 18, 2017
బుల్లి తెరపై మెగా సీరియల్ శాంతి నివాసం నుంచి వెండి తెరపై సూపర్ హిట్ సినిమా స్టూడెంట్ నెంబర్ 1 అడుగు పెట్టిన దర్శకుడు రాజమౌళి.. తీసిన ప్రతి సినిమా సక్సెస్.. అయితే.. ఇన్ని సినిమాలు ఒక ఎత్తు.. ప్రపంచ వ్యాప్తంగా ఓ తెలుగు సినిమాను మాట్లాడుకొనేలా చేసిన బాహుబలి సినిమా ఒకెత్తు.. ఇండియన్ క్రేజీ డైరెక్టర్ గా పేరు సంపాదించిన దర్శక ధీరుడు.. రాజమౌళి కి ఓ సినిమా అమితంగా నచ్చిందట.. ఎంతగా ఆ సినిమా రాజమౌళిని ఆకట్టుకొన్నది అంటే 100 సార్లకు పైగా ఆ సినిమాను చూసేటంతగా.. తన సినిమాలతో అందిరి మనసులను దోచే జక్కన్న మనసుకు నచ్చిన సినిమా ఏదో తెలుసా..!! హాలీవుడ్ మూవీ "బ్రేవ్ హార్ట్" అట..
మెల్ గిబ్బన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్.. ఎమోషనల్ సినిమాకు రాజమౌళి ఫిదా అయ్యాడట..!! ఈ సినిమాను దాదాపు 100 సార్లు చూశాడట... దీంతో ఈ సినిమా స్పూర్తితోనే రాజమౌళి నెక్స్ట్ సినిమా ఉంటుంది అని టాక్ వినిపిస్తోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ ల కాంబోలో తెరకెక్కించనున్న ఈ సినిమా గురించి అనేక పుకార్లు షికారు చేస్తున్నాయి.. మెగా నందమూరి హీరోలను ఒకే స్క్రీన్ పై తీసుకోస్తూ.. బాహుబలి కి మించిన బజ్ ఏర్పడేలా చేసిన రాజమౌళి... ఈ సినిమాకు పక్కా స్క్రిప్ట్ రెడీ చేసి.. 2018 ద్వితీయార్ధం లో సెట్స్ మీదకు తీసుకొని వెళ్లాలని చూస్తున్నాడట. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా మరోసారి రికార్డ్స్ ని తిరగరాయడం ఖాయం అనే టాక్ వినిపిస్తోంది. కుటుంబ నేపద్య కథగా ఉండే ఈ సినిమాలో తారక్.. చరణ్ లు అన్నదమ్ములుగా కనిపించనున్నారు అనే టాక్ .. సినిమా చరిత్రలో సరికొత్త అధ్యయంగా ఈ సినిమా ఉండనున్నది అని.. మెగా నందమూరి అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు..
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల