గుండు హనుమంతరావు, పొట్టి వీరయ్యలకు చిరంజీవి ఆర్ధిక సాయం..!!

- December 18, 2017 , by Maagulf
గుండు హనుమంతరావు, పొట్టి వీరయ్యలకు చిరంజీవి ఆర్ధిక సాయం..!!

సీనియర్ కమెడియన్ గుండు హనుమంతరావు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ.. ఉన్న సంగతి ప్రముఖ టెలివిజన్ షో అలితో జాలిగా ద్వారా తెలుసుకొన్న మెగాస్టార్ చిరంజీవి.. గుండు హనుమంతరావు కి ... అంతేకాదు.. మరో సీనియర్ కమెడియన్ పొట్టి వీరయ్య ఆర్ధక పరిస్తితి గురించి పత్రికలో రాగా చిరంజీవి సతీమణి సురేఖ.. చలించిపోయారు.. తమ వంతు సాయం అందించమని చిరంజీవి కి చెప్పగా... మా అధ్యక్షుడు శివాజీరాజాను పిలిపించి.. ఇద్దరికీ తక్షణ సాయంగా చెరో రెండు లక్షల రూపాయల చెక్ ను అందజేశారు. ఈ చెక్ ను శివాజీరాజా... మా జాయింట్ సెక్రటరీ ఏడిద శ్రీరామ్, కల్చ‌ర‌ల్ క‌మిటీ చైర్మ‌న్ సురేష్ కొండేటి, ఎగ్యిక్యూటివ్ మెంబ‌ర్ సురేష్ స్వ‌యంగా అపోలో అసుప‌త్రికి వెళ్ళి గుండు హనుమంత రావుకి చెక్ అందించారు. అనంతరం గుండు హ‌నుమంతురావు త‌న అనారోగ్యాన్ని సైతం లెక్క చేయ‌కుండా ఎంతో సంతోషంగా చిరంజీవితో కాసేపు ఫోన్  లో మాట్లాడారు.. 

అనంతరం శివాజీ రాజా కష్టాల్లో ఉన్న పొట్టి వీరయ్యను మా ఆఫీస్ కు పిలిచి ఏడిద శ్రీరామ్ చేతుల మీదుగా రెండు లక్షల చెక్ ను అందించారు. ఈ సంద‌ర్భంగా 'మా' అధ్య‌క్షుడు శివాజీ రాజా మాట్లాడుతూ.. రెండు రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవిగారు ఫోన్ చేసి శివాజీ అర్జెంట్ గా ఇంటికి రా అన్నారు. వెంట‌నే శ్రీరామ్, నేను వెళ్లాము. గుండు హ‌నుమంతురావు, పొట్టి వీర‌య్య క‌ష్టాల్లో ఉన్నట్లున్నారు.. వెంట‌నే వాళ్లిద్ద‌రికీ చెరో రెండు ల‌క్ష‌లు ఇవ్వ‌మ‌ని చెక్ లు ఇచ్చారు. ఆయ‌న ఇచ్చిన అర‌గంట‌లోనే ఇద్ద‌రికీ చెక్ లు అందించాం. చిరంజీవి గారు చాలా సంతోషించారు. ఎప్పుడు ఏ అవ‌స‌రం వ‌చ్చినా...ఎవ‌రు క‌ష్టాల్లో ఉన్నా నాకొచ్చి చెప్పు. స‌హాయం చేద్దాం అన్నారు. ఈ విష‌యంలో నేను 'మా' అధ్య‌క్షుడిగానే కాకుండా న‌టుడిగా చాలా సంతోషించాను. హ్యాట్సాఫ్ చిరంజీవి గారు' అని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com