'అజ్ఞాతవాసి' ఆఫీసు వద్ద అలజడి!

- December 18, 2017 , by Maagulf
'అజ్ఞాతవాసి' ఆఫీసు వద్ద అలజడి!

పవన్ కళ్యాణ్ పాతికవ సినిమా 'అజ్ఞాతవాసి' కోసం పవర్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రెండు పాటలు బైటికొచ్చేశాయి. కంటెంట్ పరంగా కూడా భారీగా అంచనాల్ని పెంచేసిన ఈ మూవీ టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ ఫిలింగా మారింది. ఈ మూవీ ఆడియో రిలీజ్ వేడుకను ఈనెల 19న అట్టహాసంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈవెంట్ టెలికాస్టింగ్ హక్కుల్ని ఒక న్యూస్ ఛానల్ 85 లక్షలకు కొనుగోలు చేసినట్లు వార్తలొచ్చాయి.

మెగా ఫ్యామిలీ నుంచి ఎవరొస్తారన్న క్లారిటీ లేనప్పటికీ.. ఈ ఫంక్షన్ భారీ స్థాయిలో జరగవచ్చన్న అంచనా అయితే వుంది. ఇదిలా ఉంటే.. ఈ వేడుకను చూసేందుకు అన్ని ప్రాంతాల నుంచి అభిమానులు ఎగబడుతున్నారు. ఎంట్రీ పాసులు ఇస్తారన్న వార్తలు రావడంతో... బంజారా హిల్స్ లోని నిర్మాణ సంస్థ 'హారికా హాసిని' క్రియేషన్స్ వద్ద వందలాంది మంది ఫ్యాన్స్ గుమిగూడారు.

మధ్యాహ్నం నుంచి వేచివున్నప్పటికీ టిక్కెట్స్ ఇవ్వకపోవడంతో వీళ్ళలో అసహనం పెరిగిపోయింది. చివరకు ఫాన్స్ ని కట్టడి చేయడానికి బౌన్సర్లను ప్రయోగించాల్సి వచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com