హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం
- December 18, 2017
హైదరాబాద్: నగరంలో అర్ధరాత్రి సమయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. బైరామల్ గూడాలోని ఓ బిస్కెట్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్నిప్రమాద ఘటనను మరువక ముందే మరో అగ్ని ప్రమాదం జరగడం కలకలంగా మారింది. ఎల్బీ నగర్ బైరామల్‌గూడలోని ఓ స్కాబ్ గోడౌన్‌లో మంటలు ఎగసిపడ్డాయి. దీంతో స్థానిక ప్రజలు భయందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది ఐదు ఫైర్ ఇంజన్లతో రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాం చేశారు.
గోడౌన్‌లో ప్లాస్టిక్ పదార్థాలు, సీసాలు ఉండటంతో ప్రమాదం చోటుచేసుకుందని భావిస్తున్నారు. ఈ ఘటనపై కార్పొరేటర్ మాట్లాడుతూ.. ఫైర్ సిబ్బంది అప్రమత్తంతో ప్రమాదం తప్పిందన్నారు. మూడు గోడౌన్‌లో ఉన్న వస్తువులు పూర్తిగా కాలిపోయాయని ఆయన చెప్పారు. పెద్ద మొత్తంలో ఆస్తినష్టం సంభవించిందని తెలిపారు. దీనిపై సీఐ మాట్లాడుతూ.. విషయం తెలిసిన వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించామన్నారు. గోడౌన్‌లో పాత ప్లాస్టిక్ వస్తువులు ఉండటంతో ప్రమాదం సంభవించి ఉంటుందని ఆయన అంచనా వేశారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల