బహ్రెయిన్‌ నేషనల్‌ డే వేడుకలు

- December 18, 2017 , by Maagulf
బహ్రెయిన్‌ నేషనల్‌ డే వేడుకలు

మనామా: బహ్రెయినీ పాకిస్తానీ ఫ్రెండ్షిప్‌ సొసైటీ, బహ్రెయిన్‌ 46వ నేషనల్‌ డే వేడుకల్ని ఘనంగా నిర్వహించింది. బహ్రెయిన్‌లో పాకిస్తాన్‌ అంబాసిడర్‌ జావెద్‌ మాలిక్‌, పలువురు బహ్రెయిన్‌ ప్రముఖులు, బహ్రెయిన్‌లోని పాకిస్తానీ కమ్యూనిటీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా బహ్రెయినీ పాకిస్తానీ ఫ్రెండ్షిప్‌ సొసైటీ ఛైర్మన్‌ అబ్దుల్లా బిమోవైల్‌ మాట్లాడుతూ, కింగ్‌ హమాద్‌ బిన్‌ ఇసా అల్‌ ఖలీఫా నేతృత్వంలో బహ్రెయిన్‌ సాధించిన ప్రగతిని కొనియాడారు. పాకిస్తాన్‌ - బహ్రెయిన్‌ మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతున్నాయనీ, ఆ సంబంధాలు ముందు ముందు ఇంకా బలోపేతమవ్వాలని ఆకాంక్షించారు బిన్‌హోవైల్‌. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com