డిసెంబర్ 24న విజయవాడలో "జై సింహా" ఆడియో విడుదల వేడుక !!
- December 19, 2017
నందమూరి బాలకృష్ణ, నయనతార, నటాషా జోషి, హరిప్రియ ప్రధాన పాత్రధారులుగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "జై సింహా" షూటింగ్ పూర్తి చేసుకొని జనవరి 12న విడుదలయ్యేందుకు సన్నద్ధమవుతుండగా.. చిత్ర నిర్మాత సి.కళ్యాణ్ "జై సింహా" ఆడియోను డిసెంబర్ 24న విడుదల చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. విజయవాడలోని వజ్ర గ్రౌండ్స్ లో అత్యంత ఘనంగా ఆడియో వేడుకను నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ.. "దుబాయ్ లో చిత్రీకరించిన పాటలో షూటింగ్ పూర్తయ్యింది. చిరంతన్ భట్ సంగీత సారధ్యంలో రూపొందిన పాటలను డిసెంబర్ 24న విజయవాడలోని వజ్రా గ్రౌండ్స్ లో భారీ వేడుక నిర్వహించి విడుదల చేయనున్నాం. నందమూరి బాలకృష్ణ మరియు చిత్రబృంద సభ్యులందరూ ఈ వేడుకకు హాజరుకానున్నారు. జనవరి 12న బాలయ్య అభిమానులకు సంక్రాంతి కానుకగా "జై సింహా" చిత్రాన్ని విడుదల చేయనున్నాం. బాలయ్య ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్, కె.ఎస్.రవికుమార్ చిత్రాన్ని తెరకెక్కించిన విధానం ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకొంటుంది. సీకే ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ నుండి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయడం గర్వంగా భావిస్తున్నాం" అన్నారు.
నందమూరి బాలకృష్ణ, నయనతార, నటాషా జోషి, హరిప్రియ, బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, అశుతోష్ రాణా, మురళి మోహన్, జయప్రకాష్ రెడ్డి, ప్రభాకర్, శివపార్వతి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కథ-మాటలు: ఎం.రత్నం, కళ: నారాయణ రెడ్డి, యాక్షన్: అంబరివ్-రామ్ లక్ష్మణ్-వెంకట్, కెమెరా: రాంప్రసాద్, సంగీతం: చిరంతన్ భట్, సహనిర్మాత: సి.వి.రావు, కార్యనిర్వాహక నిర్మాతలు: వరుణ్-తేజ, నిర్మాత: సి.కళ్యాణ్, దర్శకత్వం: కె.ఎస్.రవికుమార్.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల