నాలో అంతర్గతంగా అర్జునుడు ఉన్నాడు: విల్ స్మిత్
- December 19, 2017
భారతీయ చరిత్ర అంటే తనకెంతో ఇష్టమని, భగవద్గీతను తాను 90 శాతం చదివేశానని అన్నాడు ప్రముఖ హాలీవుడ్ నటుడు విల్ స్మిత్. తను హీరోగా నటించిన " బ్రైట్ " చిత్రం ఈ నెల 22 న ఇండియాలో విడుదల అవుతున్న సందర్భంగా..ముంబై వచ్చిన స్మిత్..ఓ పాపులర్ ఇంగ్లీషు మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. తనలో అంతర్గతంగా అర్జునుడు ఉన్నాడని సంచలన కామెంట్ చేశాడు.
బాలీవుడ్ లో చాలా గ్రాండ్ గా పార్టీలు జరుపుకుంటారని, తను ఇండియాకు రావడం ఇది నాలుగోసారి కాగా.. మూడో సారి ముంబై వచ్చానని తెలిపాడు. బాలీవుడ్ తో..ముఖ్యంగా నటుడు అక్షయ్ కుమార్ తో నాకెంతో అనుబంధం ఉంది. గతంలో వచ్చినప్పుడు అక్షయ్ కుమార్ ఇంట్లో డిన్నర్ చేశా..చాలా టేస్టీగా ఉంది అని విల్ స్మిత్ పేర్కొన్నాడు. త్వరలో రిషీ కేశ్ వెళ్లి అక్కడ చాలా రోజులు గడపలనుకుంటున్నట్టు చెప్పాడు. విల్ స్మిత్ తో బాటు మరో నటుడు జోయెల్ ఎడ్ వర్టన్ కూడా ముంబై చేరుకున్నాడు. ఫాంటసీ అడ్వెంచర్ అయిన బ్రైట్ చిత్రానికి డేవిడ్ అయ్యర్ దర్శకుడు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల