ముగింపు రోజున కేసీఆర్ ఏం తేల్చనున్నాడో

- December 19, 2017 , by Maagulf
ముగింపు రోజున కేసీఆర్ ఏం తేల్చనున్నాడో

ప్రపంచ తెలుగు మహాసభలు ముగింపుకొచ్చేశాయి. 42 దేశాల నుంచి 450మంది విదేశీ ప్రతినిధులు విచ్చేసిన ఈ సభలు ఇప్పటికే విజయవంతం అయినట్లు.. ఇంటా బైటా చెప్పుకుంటున్నారు. కానీ.. మహాసభలు ఎంతమేరకు సక్సెస్ అయ్యాయన్నది కేసీఆర్ ఇచ్చే ఫినిషింగ్ టచెస్ మీద మాత్రమే ఆధారపడి వుంది. ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభమైన సభలు.. ఈరోజు రాష్ట్రపతి సమక్షంలో ముగియనున్నాయి. ఈ వేదిక మీద కేసీఆర్ ఇచ్చే ప్రసంగం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే 1 నుంచి 12వ తరగతి వరకు అన్ని పాఠశాలల్లో తెలుగు అభ్యాసాన్ని తప్పనిసరి చేసిన ఆయన దానికి సంబంధించిన కార్యాచరణ ప్రకటిస్తారు. పాలనాభాషగా తెలుగును విధిగా అమలు చేయాలని, తెలుగులో చదివిన అభ్యర్థులకు ఉద్యోగాల్లో వాటా కల్పించాలని, తెలుగు భాషా పండితుల సమస్యల్ని పరిష్కరించాలని కేసీఆర్ దగ్గర ప్రతిపాదనలున్నాయి. ఇవి కాకుండా.. రాష్ట్రంలో ప్రతీ సంవత్సరం తెలుగు మహాసభల్ని నిర్వహించుకుని, తెలుగు భాష అభివృద్ధికి పురస్కారాలు, ప్రోత్సాహకాలు అందజేసేలా నిర్ణయం ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇంతకుముందులా తూతూ మంత్రంలా కాకుండా తన నేతృత్వంలో జరిగిన తెలుగు మహాసభలు పూర్తి ఫలవంతం కావాలన్నది కేసీఆర్ ఆలోచన.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com