తాతయ్య మరణించినప్పుడు కీర్తి నన్ను పరామర్శించింది: సుమంత్
- December 19, 2017
'మళ్లీ రావా' అంటూ వచ్చిన హీరో సుమంత్ ఎట్టకేలకు మళ్లీ ఓ హిట్ అందుకున్నాడు. విజయోత్సాహంలో ఉన్న సుమంత్ తన తదుపరి చిత్రం కోసం కథలు వినే పనిలో ఉన్నారు. అయితే, ఆయన తొలిసారిగా తన వ్యక్తిగత విషయాన్ని మీడియాతో షేర్ చేసుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఆయన మాజీ సతీమణి, నటి కీర్తి రెడ్డితో విడాకులు తీసుకోవడం వెనుక గల కారణాన్ని వెల్లడించారు. 2004లో పెళ్లి చేసుకున్న సుమంత్, కీర్తిరెడ్డి ఏడాదిలోనే విడాకులు తీసుకున్నారు. అయితే, సుమంత్ ఈ విషయంపై మాట్లాడటానికి పెద్దగా ఇష్టపడేవారు కాదు.
దీనిపై ఆయన మాట్లాడుతూ.. ఒకరినొకరు ఇష్డపడే పెళ్లి చేసుకున్నాం. కానీ, పెళ్లి తర్వాత మా అభిప్రాయాలు వేరని అర్థమైంది. అందుకే, పరస్పర అంగీకారంతో విడిపోయాం. అయితే, కీర్తి ఇప్పటికీ నాకు మంచి ఫ్రెండ్. అప్పుడప్పుడు ఫోన్ చేసి యోగక్షేమాలు తెలుసుకుంటాను. ఆమె మళ్లీ పెళ్లి చేసుకుని, ఇద్దరు పిల్లలకు తల్లి కావడం నాకు సంతోషంగా అనిపించింది. మా తాతయ్య అక్కినేని నాగేశ్వరరావు కన్నుమూసిన తర్వాత ఆమె పరామర్శకు వచ్చింది. ఆ తర్వాత మళ్లీ ఆమెను కలవలేదు. అదే చివరిసారి అని సుమంత్ తెలిపారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల