మీరు స్మార్ట్ బైక్స్ వాడుతున్నారా?
- December 19, 2017మెట్రో రైల్.. హైదరాబాద్ నగర వాసులు ఎప్పటి నుంచో దీని కోసం ఆతృతగా ఎదురు చూస్తూ వచ్చారు. తీరా ఆ సమయం రానే వచ్చింది. మెట్రో రైల్ ఎట్టకేలకు ప్రారంభమైంది. మియాపూర్ నుంచి నాగోల్ వరకు మొత్తం 30 కిలోమీటర్ల దూరం వరకు మెట్రో రైల్ ప్రారంభమైంది. ఈ మార్గంలో ఇప్పుడు మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. ప్రయాణికులు వాటిలో వెళ్తున్నారు కూడా. సరే. ఇదంతా ఓకే. తెలిసిందే కదా.. అంటరా..! అవునండీ.. మెట్రో రైల్ గురించి అందరికీ తెలుసు. కానీ ఆ రైల్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన స్మార్ట్‌బైక్‌లు.. అవేనండీ స్మార్ట్ సైకిల్స్.. వాటి గురించి చాలా మందికి తెలియదు. ఇంతకీ అవి ఎలా పనిచేస్తాయో, వాటిని ఎలా వాడుకోవచ్చో తెలుసా..? అదే ఇప్పుడు తెలుసుకుందాం.
మెట్రోరైల్ స్టేషన్లయిన మియాపూర్, కేపీహెచ్‌బీ, నాగోల్, ఉప్పల్ స్టేడియం, హబ్సిగూడల వద్ద మాత్రమే ప్రస్తుతం ఈ స్మార్ట్‌బైక్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ సైకిల్స్‌ను సైకుల్ అనే సంస్థ ఏర్పాటు చేసింది. ఈ సంస్థ జర్మనీ నుంచి వాటిని తెప్పించింది. ఇందుకు గాను సైకుల్ సంస్థ మెట్రో రైల్ యాజమాన్యంతో ఒప్పందం చేసుకుంది. అందులో భాగంగానే వారు ఈ స్మార్ట్ బైక్‌లను నగరానికి తెచ్చి మెట్రో రైల్ స్టేషన్ల వద్ద ప్రయాణికులకు అందుబాటులో ఉంచారు. వీటి ఉద్దేశం ఏమిటంటే. నగరంలో రోజు రోజుకీ పెరిగిపోతున్న కాలుష్యాన్ని తగ్గించడమే. అందుకోసమే ఈ సైకిల్స్‌ను ఏర్పాటు చేశారు.
అయితే ఈ స్మార్ట్ సైకిల్స్‌లో అంతర్గతంగా ఓ జీపీఎస్ పరికరం ఉంటుంది. దీని వల్ల ఎవరూ కూడా సైకిల్‌ను అంత తేలిగ్గా దొంగతనం చేయలేరు. చేసినా అందులో జీపీఎస్ ఉంటుంది కనుక దాని లొకేషన్‌ను ఈజీగా తెలుసుకోవచ్చు. దీంతో సైకిల్ దొంగలు ఇట్టే దొరుకుతారు. ఇక ఈ సైకిల్‌ను గంటకు ఇంత అని లెక్క కట్టి రెంట్‌కు ఇస్తారు. అందుకు గాను ఓ యాప్‌ను ప్రయాణికులు తమ మొబైల్ ఫోన్లలో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. దీంతో సైకిల్ పై ఉండే కోడ్‌ను రీడ్ చేసి దాన్ని స్వారీ చేయవచ్చు. లేదంటే స్మార్ట్ కార్డును కొనవచ్చు. ఇలా రెండు రకాలుగా సైకిల్‌కు గాను మనం వాడినందుకు అయ్యే రెంట్‌ను చెల్లించి సైకిల్‌ను వాడుకోవచ్చు. ఒక స్టేషన్‌లో రెంట్‌కు తీసుకుంటే మరొక స్టేషన్‌లోనూ దాన్ని రిటర్న్ ఇవ్వవచ్చు. ఇక ఈ సైకిల్‌ను వాడేవారు మెంబర్‌షిప్ పొందితే మొదటి 30 నిమిషాల పాటు దీన్ని ఉచితంగా వాడుకోవచ్చు. తరువాత 30 నుంచి 60 నిమిషాలకు రూ.10 చార్జి చేస్తారు. ఆ తరువాత ప్రతి 30 నిమిషాలకు రూ.15 వరకు చార్జి పడుతుంది. అదే 8 గంటల తరువాత అయితే 1 గంటకు రూ.100 చొప్పున అదనపు చార్జిలు పడతాయి. ఇక మెంబర్లు కాని వారు సైకిల్‌ను రెంట్‌కు తీసుకుంటే వారు మొదటి 30 నిమిషాలకు రూ.10 చెల్లించాలి. తరువాత 30 నుంచి 60 నిమిషాలకు రూ.25, ఆ తరువాత ప్రతి అదనపు 30 నిమిషాలకు రూ.30, 8 గంటల తరువాత ప్రతి గంటకు రూ.150 చెల్లించాల్సి ఉంటుంది. ఇవీ.. మెట్రో రైల్ స్మార్ట్ సైకిల్ గురించిన వివరాలు..!
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల