బి12 ఇంజెక్షన్లతో బలం పెరుగుతుందా?

- December 19, 2017 , by Maagulf
బి12 ఇంజెక్షన్లతో  బలం పెరుగుతుందా?

బలం పెరుగుతుందని, ఆరోగ్యం మెరుగుపడుతుందని, బరువు తగ్గటం ఆగుతుందని కొందరు విటమిన్‌ బి12 ఇంజెక్షన్లు తీసుకుంటుంటారు. ఇలాంటి ధోరణి పల్లెటూళ్లలో ఎక్కువ. నిజానికి రక్తంలో బి12 మోతాదులు మామూలుగా ఉంటే వీటితో ప్రయోజనమేమీ ఉండదు. అయితే బి12 మోతాదులు తగ్గినవారు మాత్రం దాన్ని భర్తీ చేసుకోవటం చాలా అవసరం. దీని లోపం వృద్ధుల్లో, పూర్తి శాకాహారుల్లో, బరువు తగ్గటానికి బేరియాట్రిక్‌ సర్జరీ చేయించుకున్నవారిలో తరచుగా కనబడుతుంది. తేలికైన రక్తపరీక్ష ద్వారా దీని మోతాదులు తెలుసుకోవచ్చు. అయితే ఈ పరీక్షను అంతగా చేయరు. అందువల్ల ఒకవేళ లోపం ఉన్నా కూడా ఏళ్లకేళ్లు తెలియకుండానే ఉండిపోతుంటుంది. బి12 లోపం మూలంగా రక్తహీనత తలెత్తుతుంది. లోపం స్వల్పంగా ఉంటే పైకి లక్షణాలేమీ కనబడవు. తీవ్రమవుతున్నకొద్దీ బలహీనత, అలసట, తల తేలిపోవటం, ఆయాసం, చర్మం పాలిపోవటం, నాలుక నునుపుగా మారటం, మలబద్ధకం, విరేచనాలు, ఆకలి తగ్గటం, గ్యాస్‌, తిమ్మిర్లు, మొద్దుబారటం, సరిగా నడవలేకపోవటం, చూపు తగ్గటం, కుంగుబాటు, మతిమరుపు, ప్రవర్తనలో మార్పుల వంటి లక్షణాలు కనబడతాయి. కాబట్టి ఇలాంటివి కనబడినప్పుడు డాక్టర్‌ను సంప్రదించి బి12 మోతాదులు పరీక్షించుకోవటం మంచిది. లోపం ఉంటే బి12 ఇంజెక్షన్లు, మాత్రలు బాగా ఉపయోగపడతాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com