చరిత్రలో అతిపెద్ద బడ్జెట్‌ని ప్రకటించిన సౌదీ అరేబియా
- December 19, 2017
సౌదీ అరేబియా:చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక స్థాయిలో 2018 సంవత్సరానికిగాను బడ్జెట్ కేటాయింపులు ఉండనున్నట్లు కింగ్ సల్మాన్, రియాద్‌లో యాన్యువల్ బడ్జెట్ స్టేట్మెంట్ సందర్భంగా పేర్కొన్నారు. 978 బిలియన్ సౌదీ రియాల్స్ (260.8బిలియన్ డాలర్లు) 2018లో ఖర్చు చేయనున్నారు. 2017లో ఈ మొత్తం 890 బిలియన్ సౌదీ రియాల్స్. ప్రైవేట్ సెక్టార్‌కి సంబంధించి మైనింగ్ ప్రాజెక్టులు, ఇండస్ట్రియల్, హౌసింగ్ ఫండింగ్ వంటి విభాగాలకు అదనపు కేటాయింపులు ఉంటాయి. బడ్జెట్ డెఫిషిట్ 195 బిలియన్ సౌదీ రియాల్స్ ఉండనుంది. 2017లో ఇది 230 బిలియన్ సౌదీ రియాల్స్. 2015 తర్వాత 10 శాతం జిడిపి అంచనా వేస్తున్నారు. 2017లో 692 బిలియన్ సౌదీ రియాల్స్ రెవెన్యూ ఉండగా, 2018 నాటికి 783 బిలియన్ సౌదీ రియాల్స్ ఉండనుంది. కింగ్డమ్ విజన్ 2030 సంస్కరణల్లో భాగంగా బడ్జెట్ రూపొందినట్లు కింగ్ సల్మాన్ చెప్పారు.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







