పవన్ అభిమానులకు డబుల్ ధమాకా!! మరి అదేంటంటే...
- December 20, 2017
పవన్ కళ్యాణ్ 25వ చిత్రం అజ్ఞాతవాసి చిత్రంపై తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశ విదేశాలలోను ఆసక్తి నెలకొంది. ఇటీవల విడుదలైన చిత్ర టీజర్ సంచలనం సృష్టించింది. సౌత్‌లో ఎక్కువ వ్యూస్ సాధించిన రెండో టీజర్‌గా రికార్డు నెలకొల్పింది. ఇక నిన్న జరిగిన ఆడియో వేడుకలో ట్రైలర్ విడుదల చేస్తారని భావించగా, కేవలం పాటలని మాత్రమే విడుదల చేసిన చిత్ర యూనిట్ ట్రైలర్‌ని రిలీజ్ చేయలేదు. తాజాగా ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 26న చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ని విడుదల చేయాలని భావిస్తుంది చిత్ర బృందం. ఇక ఈ సినిమాలోను పవన్ కళ్యాణ్ ఒక పాట పాడాడని తెలుస్తుండగా, డిసెంబర్ 31న ఆ సాంగ్‌ని విడుదల చేయనున్నారు. అంటే వచ్చే వారంలో పవన్ అభిమానులకి డబుల్ బోనాంజా దొరకనుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బొమన్ ఇరానీ, ఖుష్బూ, ఆది పినిశెట్టి, రావు రమేశ్, మురళీ శర్మ ముఖ్య పాత్రలు పోషించగా కీర్తి సురేష్, అను ఎమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బేనర్‌పై రాధాకృష్ణ నిర్మించిన ఈ చిత్రం జనవరి 10న విడుదల కానున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల