12 ఏళ్ల పిల్లాడు.. ప్రమాదాన్ని పసిగట్టాడు.. వందల మందిని కాపాడాడు
- December 20, 2017
ఆకతాయి పిల్లాడు.. ఆడుకుంటూ రైల్వే ట్రాక్‌పైకి వెళ్లాడు... వాడు కూడా అనుకుని ఉండడు. నేను కూడా ఇంత మందిని కాపాడగలనని.. 12 ఏళ్ల ఆ బాలుడు రైలు ప్రమాదాన్నిముందుగానే పసిగట్టాడు. వందల మంది ప్రయాణీకుల ప్రాణాల్ని కాపాడాడు.
ఈ ఘటన బీహార్‌లో చోటు చేసుకుంది. భీమ్ (12) అనే బాలుడు రైల్వే ట్రాక్‌పై నడుచుకుంటూ వెళుతున్నాడు. ఒకచోట అతడికి రైలు పట్టా విరిగినట్లుగా కనిపించింది. ఆ చిన్ని హృదయం ఎందుకో రాబోయే ఉపద్రవాన్ని పసిగట్టింది. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి గేట్‌మెన్‌కి ఈ విషయాన్ని చెప్పాడు. స్పందించిన గేట్‌మెన్.. స్టేషన్ మాస్టర్‌కి విషయాన్ని వివరించి ఆ సమయానికి వస్తున్న రైలుని నిలిపివేశారు. సరిగ్గా అదే సమయంలో గోరక్‌పూర్-నర్కాటియగంజ్ లోకల్ వస్తోందని, మరో 15 నిమిషాల్లో అది అక్కడకు చేరుకునేదని తెలియజేశారు. అయితే ఆ బాలుడు ఈ విషయాన్ని పసిగట్టి తెలియజేయడంతో వెంటనే అప్రమత్తమై ఘోర ప్రమాదాన్ని నివారించగలిగామని అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. అందరి ప్రాణాలను కాపాడిని ఆ బాలుడికి చదువు నిమిత్తంగా సాయం చేస్తామంటున్నారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!