స్వీటీ అనుష్క పై ప్రభాస్ ప్రశంసల వర్షం..!!

- December 20, 2017 , by Maagulf
స్వీటీ అనుష్క పై ప్రభాస్ ప్రశంసల వర్షం..!!

టాలీవుడ్ లో వెండి తెరపై చూడముచ్చటైన జంటల్లో ఒకటి ప్రభాస్.. అనుష్కల జంట.. బిల్లా, మిర్చి వంటి సినిమాల్లో వీరిజోడి అభిమానులను ఆకర్షిస్తే.. బాహుబలి సినిమాతో సామాన్యులను సైతం ఆకర్షించింది. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్.. సాహో సినిమాతో.. అనుష్క .. భాగమతి సినిమాతో బిజీ అయ్యారు. మధ్యలో ఒకరి పుట్టిన రోజుకి ఒకరు గ్రీటింగ్ చెప్పుకోవడం మినహా ఇద్దరూ తమ తమ సినిమాలతో బిజీ.. కాగా అనుష్క తాజాగా సినిమా భాగమతి టీజర్ రిలీజైంది. ఈ టీజర్ ను ప్రభాస్ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసి.. "ప్రతి చిత్రంలోనూ కొత్తదనం చూపించాలనుకొనే వారిలో ఈమె ముందుంటుంది. స్వీటీకి .. యువీ క్రియెషన్స్ టీం కు గుడ్ లక్" అని కామెంట్ ను జత చేశాడు పభాస్.. అనుష్క పై ప్రశంసలను కురిపించాడు. అనుష్క ప్రధాన పాత్రలో.. పిల్లజమీందార్ ఫేమ్ అశోక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఏకకాలంలో షూటింగ్ జరుపుకొంటున్నది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com