కాకినాడకు A.R. రెహమాన్‌,సల్మాన్.. బీచ్‌ ఫెస్ట్‌లో జిల్‌ జిల్‌ జిగా

- December 20, 2017 , by Maagulf
కాకినాడకు A.R. రెహమాన్‌,సల్మాన్.. బీచ్‌ ఫెస్ట్‌లో జిల్‌ జిల్‌ జిగా

ప్రభుత్వం భారీ ఎత్తున నిర్వహిస్తున్న కాకినాడ్‌ బీచ్‌ ఫెస్ట్‌లో భాగంగా రెండోరోజు మ్యూజికల్‌ నైట్‌ నిర్వహించారు.ఈ వేడుకలకు బాలీవుడ్ ప్రముఖ నటుడు సల్మాన్ ఖాన్, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ బుధవారం హాజరుకావాల్సి ఉంది. కానీ, అనుకోని కారణాల వల్ల వారు గురువారం బీచ్ ఫెస్టివల్‌లో సందడి చేయనున్నారు. మంగళవారం ప్రారంభమైన  కాకినాడ్ బీచ్‌ వేడుకల్లో సందర్శకుల సందడి చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకూ.. జనమే జనం.  ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంగీత విభావరితో కాకినాడ తీరం సందడిగా మారింది. బీచ్‌లో  సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో గాయకులు సింహా, హేమంత్‌, సునీత, గీతామాధురి తదితరులు పాటలతో అలరించారు. ఇవాళ సాయంత్రం జరగనున్న A.R. రెహమాన్‌ మ్యూజికల్‌ షో.. మొత్తం ఈవెంట్‌కే హైలైట్‌గా నిలవనుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com