'టీవీ5 ఎడిటర్‌ దినేష్‌ ఆకుల' కు ప్రతిష్టాత్మకమైన రామ్‌నాథ్‌ గోయెంకా అవార్డు

- December 20, 2017 , by Maagulf

ఢిల్లీ: జర్నలిజం రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన రామ్‌నాథ్‌ గోయెంకా అవార్డు టీవీ5 ఎడిటర్‌ దినేష్‌ ఆకులను వరించింది. ఢిల్లీలో వైభవంగా జరిగిన కార్యక్రమంలో భారత ఉపరాష్ట్రపతి M.వెంకయ్య నాయుడు చేతుల మీదుగా దినేష్‌ ఆకుల అవార్డు అందుకున్నారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ సంస్థ వ్యవస్థాపకుడు రామ్‌నాథ్‌ గోయెంకా జన్మదినం సందర్భంగా ఈ అవార్డులు ప్రధానం చేయడం ఆనవాయితీ. జర్నలిజంలో నిస్పాక్షికత, ఖచ్చితత్వం, సామాజిక బాధ్యత, నిబద్ధత, ఇన్వెస్టిగేషన్‌ వంటి అంశాల ఆధారంగా అవార్డు విజేతల ఎంపిక జరుగుతుంది.

రామ్‌నాథ్‌ గోయెంకా అవార్డు కోసం ఈ ఏడాది దాదాపు 800 ఎంట్రీలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో చేనేత కార్మికుల కష్టాలను టీవీ 5 ప్రసారం చేసిన చేనేత కథలు సిరీస్‌ పురస్కారానికి ఎంపికైంది. చేనేత రంగం ఎదుర్కొంటున్న దుస్థితి, నేతన్నలు పడుతున్న కష్టాలను గ్రౌండ్‌ రిపోర్ట్‌ రూపంలో ప్రేక్షకుల కళ్లకు కట్టారు. అత్యంత హృద్యంగా ఉన్న చేనేత కథల సిరీస్‌ను... జస్టిస్‌ శ్రీకృష్ణ, దీపక్‌ పరేఖ్‌, పమేలా ఫిలిపోస్‌, SY ఖురేషి, వంటి ఉద్దండులతో కూడిన జ్యూరీ... టీవీ5ని  అవార్డుకు ఎంపిక చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com