'హలో' మాటకు, అక్కినేని కుటుంబానికీ ఎంతో అనుబంధం ఉంది: చిరు
- December 20, 2017
'హలో' మాటకు, అక్కినేని కుటుంబానికీ ఎంతో అనుబంధం ఉందన్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఒకనాడు అక్కినేని నాగేశ్వర రావు..హలో గురూ అంటూ పాడితే..నాగార్జున, అమల హలో గురూ అంటూ పాడుకున్నారు.
హలో బ్రదర్ అనే సినిమా కూడా వచ్చింది. ఇప్పుడు అఖిల్ కూడా 'హలో' అంటూ పలకరిస్తున్నాడు అని తన మాటలతో అందర్నీ మెస్మరైజ్ చేశాడు చిరు. బుధవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన అఖిల్ మూవీ హలో ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌కి చీఫ్ గెస్టుగా హాజరైన మెగాస్టార్.. అక్కినేని ఫ్యామిలీతో తనకెంతో అనుబంధం ఉందని తెలిపాడు.
'మనం' సినిమా తీసిన విక్రం అదే స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడన్నారు. అఖిల్ ఈ సినిమాతో మరో మెట్టు ఎక్కడం ఖాయమన్నాడు. ఈ కార్యక్రమంలో నాగార్జున, అమల, రామ్ చరణ్, నాగ చైతన్య, సమంత, విక్రం కుమార్, సుమంత్, లిజీ, ఈ మూవీ హీరోయిన్ కల్యాణి, అనూప్ రూబెన్స్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల