రెహ్మాన్ తో స్వరం కలపనున్న రజిని
- December 20, 2017
చెన్నై: ఇళయరాజా తర్వాత సినీ సంగీత ప్రపంచంలో ప్రభంజనం సృష్టించిన 'సంగీత తుపాను' ఏఆర్ రెహ్మాన్. ఏకంగా రెండు ఆస్కార్ అవార్డులను ఒకేసారి సొంతం చేసుకుని దేశానికే ఖ్యాతి తెచ్చి పెట్టారు. ఇటీవలే ఆయన 25 ఏళ్ల సంగీత ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ఇదిలా ఉండగా ఈ నెల 23వ తేదీన ఎన్‌కోర్ పేరిట దిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియంలో రెహ్మాన్ సంగీత విభావరి జరగనుంది. 25 ఏళ్ల ప్రస్థానం సందర్భంగా రెహ్మాన్‌ను సన్మానించే కార్యక్రమాన్ని కూడా ఈ సందర్భంగా ఏర్పాటు చేసినట్లు సమాచారం. పలువురు సినీ ప్రముఖులు పాల్గొననున్నారు. ఇందులో విశేషం ఏమిటంటే.. సూపర్‌స్టార్ రజనీకాంత్ కూడా పాల్గొని రెహ్మాన్‌ను సన్మానించనున్నారు. అంతేకాకుండా ఈ సంగీత విభావరిలో రజనీకాంత్ ఓ పాటను పాడనున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా విడుదలకు సిద్ధమవుతున్న '2.ఓ' చిత్రానికి రెహ్మాన్ సంగీతం సమకూర్చుతున్నారు. బహుశా ఆ సినిమాలోని పాటను పాడొచ్చని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా 1992లో 'మన్నన్' చిత్రంలో ఓ పాట పాడారు రజనీకాంత్.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల