బహ్రెయిన్‌లో ఫుడ్ బ్యాంక్: త్వరలో ప్రారంభం
- December 20, 2017
మనామా: లాభాపేక్ష లేని ఫుడ్ బ్యాంక్‌ని బహ్రెయిన్‌లో త్వరలో ఏర్పాటు చేయనున్నారు. వృధాని తగ్గించడంతోపాటు, ప్రజల్లో సామాజిక బాధ్యత పెంచేందుకు తద్వారా పేదలకు సాంత్వన కలిగేందుకు వీలుగా ఈ బృహత్ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. లేబర్ అండ్ సోషల్ డెవలప్‌మెంట్ మినిస్టర్ జమీల్ బిన్ మొహమ్మద్ అలి అహుమైదాన్, ఈ మేరకు బహ్రెయిన్ ఎమ్‌దాద్ సొసైటీ (బహ్రెయిన్ ఫుడ్ బ్యాంక్) ఛైర్మన్ మరియు ఫౌండర్ అయిన ఇబ్రహీమ్ అలీ దైసికి ఈ మేరకు స్వాగతం పలికారు. హైపర్ మార్కెట్స్‌ని సందర్శించి, ప్రతి యేడాదీ ఎంతో కొంత మొత్తంలో వారి నుంచి సహాయాన్ని ఆర్ధించనున్నారు. వారి నుంచి అందే వస్తువుల్ని అవసరమైన పేదలకు పంచిపెట్టనున్నారు. ఒక్కసారి ఇది ఏర్పాటైతే, ఈ సొసైటీ ద్వారా వివిధ రెస్టారెంట్లనుంచి సంప్రదించి, అక్కడ అమ్మకం అయిపోగా మిగిలిపోయిన ఆహార పదార్థాల్ని సేకరించి, వాటిని పేదలకు అందిస్తారు. పెద్ద పెద్ద వేడుకల సందర్భంగా మిగిలిపోయిన ఆహార పదార్థాల్ని కూడా సేకరించడం ఈ ఫుడ్ బ్యాంక్ లక్ష్యం.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







