ఎల్ ఎరిష్ ఎయిర్‌పోర్ట్‌పై తీవ్రవాద దాడిని ఖండించిన బహ్రెయిన్
- December 20, 2017
మనామా: ఈజిప్ట్‌లోని ఎల్ అరిష్ అంతర్జాతీయ విమానాశ్రయంపై జరిగిన తీవ్రవాద దాడిని బహ్రెయిన్ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనలో ఓ అధికారి చనిపోగా, మరో ఇద్దరు గాయపడ్డ సంగతి తెలిసినదే. బహ్రెయిన్ మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ ఓ ప్రకటనలో, బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది. ఈజిప్ట్‌కి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా మినిస్ట్రీ పేర్కొంది. తమ ప్రజల భద్రత పట్ల ఈజిప్ట్ చేపడుతున్న చర్యల్ని బహ్రెయిన్ ప్రశంసించింది. తీవ్రవాదాన్ని అంతమొందించాలంటే అంతర్జాతీయ సమాజం మొత్తం ఏకమవ్వాలని బహ్రెయిన్ అభిప్రాయపడింది.
తాజా వార్తలు
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల సూచీ..క్యూ4లో తగ్గుదల..!!
- కువైట్ లో నాలుగు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్స్‌లు రద్దు..!!
- ఫిబ్రవరిలో అహ్మదాబాద్-షార్జా మధ్య స్పైస్‌జెట్ సర్వీసులు..!!
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!







