ఒమనీ స్టూడెంట్స్‌కి 50 కిలోల బ్యాగేజ్‌ని ప్రకటించిన ఒమన్ ఎయిర్
- December 20, 2017
మస్కట్: ఒమన్ ఎయిర్, ఒమనీ స్టూడెంట్స్‌కి మద్దతుగా కీలక నిర్ణయం తీసుకుంది. అదనంగా స్టూడెంట్స్‌కి 20 కిలోల బ్యాగేజ్‌కి అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఒమన్ ఎయిర్ ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న 30 కిలోల బ్యాగేజీకి ఈ ఆఫర్ అదనం. 2018 చివరి వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని ఓ ప్రకటనలో పేర్కొంది ఒమన్ ఎయిర్. ఒమన్ ఎయిర్‌కి సంబంధించి అన్ని అంతర్జాతీయ డెస్టినేషన్స్‌కీ ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఒమన్ ఎయిర్ కంట్రీ మేనేజర్ జమాల్ అల్ అజ్కి మాట్లాడుతూ, ఒమన్ సిటిజన్స్ పట్ల ప్రత్యేకమైన అభిమానం తమకుందని తాము మరోమారు ఈ నిర్ణయం ద్వారా చాటుకోగలిగామనీ, శెలవుల కోసం గానీ, స్టడీ కోసం గానీ, ఇతత్రా విద్యా వ్యవహారాలకు సంబంధించిగానీ విమాన ప్రయాణం చేసే ఒమన్ విద్యార్థులకు ఈ నిర్ణయం కొత్త ఉత్సాహాన్నిస్తుందని చెప్పారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల