మిడిల్ క్లాస్ అబ్బాయి (MCA) మూవీ రివ్యూ

మిడిల్ క్లాస్ అబ్బాయి (MCA) మూవీ రివ్యూ

నాని, సాయి పల్లవి హీరో హీరోయిన్లు గా, రాజీవ్ కనకాల, భూమిక ప్రధాన పాత్రలలో (రీఎంట్రీ), డిఎస్పి మ్యూజిక్ అందిస్తూ, వేణు శ్రీరాం దర్శకత్వంలో, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించిన MCA చిత్రం ఎలా ఉందొ చూద్దాం.

కథ:

నాని, రాజీవ్ కనకాల ఇద్దరూ అన్న దమ్ములు. బాచిలర్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ గడిపేస్తుంటారు. వారి జీవితంలోకి రాజీవ్ భార్యగా భూమిక ఎంటర్ అవుతుంది. దీంతో తనను తన అన్న పట్టించుకోవట్లేదు అన్న భావనలో ఉంటాడు నాని. ఇంట్లో ఆధిపత్యాన్ని మొత్తం లాక్కున్న భూమిక ను చూసి నాని కొన్ని సార్లు ఆమెతో గొడవ పడతాడు. ఇదిలా ఉండగా, భూమిక కు వరంగల్ లో ఆర్టివో గా పోస్టింగ్ వస్తుంది. అలాగే రాజీవ్ ఢిల్లీ కి ట్రైనింగ్ నిమిత్తం వెళతాడు. రాజీవ్ కోరిక మేరకు వరంగల్ లో ఉన్న భూమిక యోగ క్షేమాలు నాని చూస్తుంటాడు. కాగా, ఇంజనీరింగ్ చేస్తున్న పల్లవి నాని తో తొలి చూపులోనే ప్రేమలో పడుతుంది. ట్రాన్స్పోర్ట్ మాఫియా నడిపిస్తున్న శివ భూమికను దక్కించుకోవాలని చూస్తాడు. నాని భూమికను వారి నుండి ఎలా కాపాడతాడు అన్నదే మిగతా స్టొరీ.

నటీ నటులు ప్రదర్శన & సాంకేతిక వర్గం:

నాని మధ్య తరగతి ఫ్యామిలీ కుర్రాడిగా ఆకట్టుకున్నాడు. సాయి పల్లవి తన నటనతో ఓకే అనిపించింది. అయితే తన స్థాయి పెర్ఫార్మన్స్ మాత్రం ఇవ్వలేకపోయింది. అయితే చాలా రోజుల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన భూమిక నటన ఈ సినిమాకే హైలైట్. నాని వదిన పాత్రలో ఒదిగిపోయింది. నూతనంగా పరిచమయిన విలన్ పాత్రధారి విజయ్ తన పరిధి మేరకు ఆకట్టుకున్నాడు. కాని పాత్రల్లో నేటివిటీ మిస్సైంది. రాజీవ్ కనకాల, ప్రియదర్శిని తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. నరేష్, శుభలేఖ, సుధాకర్, పవిత్ర లోకేష్ తమ పాత్రలకు న్యాయం చేసారు.
ఇంటర్వెల్ వరకు నాని తనదైన శైలిలో తన నటనతో నెట్టుకొచ్చాడు. భూమికకు చావు ను పరిచయం చేసే సీన్ సినిమాకు మంచి ప్లస్ అయింది. అయితే, ఇంటర్వెల్ తర్వాత రొటీన్ రోత సన్నివేశాలతో సినిమా చప్ప బడిపోయింది. ఫస్ట్ హాఫ్ బాగానే ఉన్నా, రొటీన్ సెకండ్ హాఫ్ ప్రేక్షకులను నిరుత్సాహపరుస్తుంది. ఇక సంగీతం విషయానికి వస్తే దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన కొత్తగా కొత్తగా, ఏవండోయ్ నాని గారు పాటలు మినహ మిగతావి రొటీన్ ట్యూన్లు అని చెప్పాలి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా దేవి స్థాయిలో లేదు. సినిమాటోగ్రాఫి బాగుంది.

నాని గత కొన్ని సినిమాల నుంచి ఎందుకు రొటీన్ కధలనే ఎంచుకుంటున్నాడో అతనికే తెలియాలి. మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నాని, ఇకపైనైనా వైవిధ్య కధలను ఎంచుకొని తన ఫాన్స్ ని మెప్పిస్తాడని వారు ఆశిస్తున్నారు.

ప్లస్

- నాని, భూమిక పాత్రలు
- ఆకట్టుకునే ఫస్ట్ హాఫ్
- సాయి పల్లవి

మైనస్

- పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్
- నీరసమైన సెకండ్ హాఫ్
- నిర్మాణ విలువలు

తీర్పు:

దిల్ రాజు, నాని. సాయిపల్లవి, డిఎస్పి కాంబినేషన్ అదిరిపోయినా, సినిమా అవుట్ పుట్ మాత్రం అంచనాలను అందుకోలేక పోయింది. రొటీన్ ఫస్ట్ హాఫ్ తో నెట్టుకొచ్చినా, సెకండ్ హాఫ్ మాత్రం సినిమా ను ముంచింది. నాని ఫాన్స్ ని మెప్పించేదిగా ఉన్నా, సినిమాను ప్రేమించి వెళ్ళే సగటు ప్రేక్షకులను మాత్రం ఈ మిడిల్ క్లాస్ అబ్బాయి నిరాశ పరుస్తుంది.

రేటింగ్ : 2.5/5

Back to Top