నాకు నా అపార్ట్మెంట్ చాలు అంటున్న రాజమౌళి
- December 20, 2017
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఈ సినిమా తరువాత దేశవ్యాప్తంగా జక్కన్న పేరు మారుమ్రోగిపోయింది. ఈ సినిమా విడుదలయ్యి చాలా కాలం గడుస్తున్నా.. ఇప్పటివరకు జక్కన్న తన తదుపరి సినిమాపై క్లారిటీ ఇవ్వలేదు. రీసెంట్ గా ఆయన ఎన్టీఆర్-రామ్ చరణ్ లతో కలిసి మల్టీస్టారర్ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం రాజమౌళి ఈ సినిమాకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనుల్లో బిజీగా గడుపుతున్నాడు.
అయితే ఈ మధ్య కాలంలో రాజమౌళి ఎన్నో ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టుకుంటున్నట్లు రాజప్రాసాదం లాంటి ఇల్లు నిర్మించుకుంటున్నాడని వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై జక్కన్న ఎప్పుడు నోరు విప్పలేదు. అయితే ఇప్పటికీ కూడా రాజమౌళి తము ఎన్నో ఏళ్ల నుండి ఉంటున్న ఫ్లాట్ లోనే నివాసం ఉంటున్నారు. వారు ఉంటున్న డబుల్ బెడ్ రూమ్ హౌస్ తమకు సరిపోతుందని.. సరిపోని స్థితి ఎప్పుడు ఎదురుకాలేదని అన్నారు రాజమౌళి. బాహుబలి సినిమా దర్శకుడు అయిన చేత పెద్ద ప్యాలస్ లో ఉండాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ఇక ఫామ్ హౌస్ గురించి ఆయన ఏం చెప్పలేదు.. కానీ తాము ఉంటున్న ఇంటిని వదిలేసి వెళ్ళే అవకాశాలు ఇప్పట్లో లేవని అన్నారు. ఇది వింతగానే అనిపిస్తుంది కదూ. ఎందుకంటే, ఆయన ఆ మధ్య అమరావతి నిర్మాణంలో కూడా సలహాలందించే పనిలో ఉన్నారు. అసెంబ్లీ ఎలా కట్టాలో కూడా కూడా డిజైన్ గీయించి ఇచ్చారు. ఆయన సొంత ఇల్లు మహిష్మతి రాజాప్రాసాదం లాాగా ఉండొచ్చనుకుంటారు అంతా.... అలా జరగడం లేదు. అదే వింత.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







