సూర్యతో రొమాన్స్ కు సింగిల్ పీస్ 'సాయి పల్లవి' రెడీ
- December 20, 2017
సూర్య వరస సినిమాలతో బిజీగా ఉన్నాడు.. ఇప్పటికే సంక్రాంతి వార్ కు గ్యాంగ్ తో రెడీ అవుతుండగా.. తాజాగా మరో సినిమాను పట్టలెక్కించే దిశగా అడుగులు వేస్తున్నాడు. సూర్య హీరోగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ఎస్.ఆర్.ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు నిర్మిస్తున్న తాజా చిత్రం సంకాంతికి ప్రారంభం కానుంది. ఇది సూర్య 36వ సినిమా. దీపావళికి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. ఈ చిత్రంలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రం టైటిల్‌ను త్వరలోనే ప్రకటిస్తారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని నిర్మాతలు తెలిపారు. ఇటీవల 'ఖాకి' వంటి సూపర్‌హిట్ చిత్రాన్ని అందించిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సూర్య 36వ చిత్రాన్ని ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







